సిఐ. ఐ నివేదిక ప్రకారం 23 దేశా లలో సుమారు 83 మిలియన్ మంది సమర్థత కలిగిన నిపుణుల కొరత ఉందని వెల్లడైంది. ఈ లోటు ను భర్తీ చేయగలిగితే 2028 సంవత్సరం నాటికి 11.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయ వనరులను ప్రపంచ స్థూల స్థూల దేశీయోత్పత్తికి అందిం చే సామర్థ్యాన్ని సంతరించుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. 65 శాతం దేశ జనాభా 35 సంవత్సరాల వయసు లోపు వారే. అలాగే దేశ ప్రగతికి, సంపతికి పునాదిరాళ్ళు. కానీ ఉన్న ఉద్యోగ మార్కెట్కు యువతకు కలిగియున్న నైపు ణ్యాలకు పొంతన లేక సుమారు 45 శాతం మంది డిగ్రీ కలిగిన యువత (youth)రుద్యోగులుగా మిగిలిపోయారని నివేది కలు చెబుతున్నాయి. వికసిత భారత్ 2047 నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రధాన భూమిక దేశ యువత, వారి చదువు. నైపుణ్యాల ద్వారానే ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించవచ్చునని దీనికి ప్రభుత్వం వివిధ ప్రభుత్వ ప్రభుత్వేర, ఆయా రంగాలలో రాణించిన సంస్థల భాగస్వా మ్యం తప్పనిసరి అని మేధావుల అభిప్రాయం. నైపుణ్యం కలిగిన యువత, సిబ్బంది కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. మారుతున్న కాలంతో మెరుగైన విపణిలో పయనించడానికి ప్రస్తుత యువజనం ఉర్రుతలూగుతున్నప్పటికీ కృతిమమేథయే రాబోవు కాలానికి ప్రగతి సూచికయనే మీమాంసలోను, భయంలోనూ ఉండిపోతున్నారు.
Read Also: http://PM-SVANidhi: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. గ్యారంటీ లేకుండా రూ.10 వేల లోన్!

దేశానికే వెన్నెముక
దేశానికే వెన్నెముక వలె నిలబడి యున్న యువతకు (youth)అనువైన, మానవ మేధస్సును మరింత పునరుజీవింప చేయడానికి ఉపకరించే తగిన నైపుణ్యాలను, శిక్షణలు అందించడానికి దోహదపడు సంస్థలను, వ్యవస్థను, కరికుల సంస్కరణలను త్వరిత గతిన ఏర్పరచకపోతే సమర్థవంతమైన శ్రామికశక్తిని సమకూర్చుకోవడం తక్షణ కరవ్యం. గోబల్ స్థాయిలో అవసరానికి కావలసిన సమర్థవంతమైన పనితనంతో నిండివున్న జన శాతం చాలా తక్కువగా కనిపిస్తోందని గోబల్ నివేదిక లు వెలడిస్తున్నాయి. సి.ఐ.ఐ నివేదిక ప్రకారం 23 దేశాలలో సుమారు 83 మిలియన్ మంది నైపుణ్యం కలిగిన వ్యక్తుల కొరత ఉందని వెలడైంది. ఈ లోటు త్వరితగతిన నివృత్తి చేయగలిగితే 2028 సంవత్సరం నాటికి 11.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయ వనరులను ప్రపంచ స్థూల దేశీయోత్పతికి అందించే సామర్థ్యాన్ని సంతరించుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. అంతేకాక భారత్ లాంటి యువభరిత దేశానికి సంకేతాలను అందిస్తూనే వుంది. ఈ అవకాశాలు, ఆశించిన ఫలితాల దృష్ట్యా నైపుణ్యాలు మెరుగుదలయనేది అతి అత్య వసరం. ప్రస్తుత తరుణంలో ఒక ప్రత్యామ్నాయం కాదు అనివార్యంగా గుర్తెరగాలి. దీనివల్ల కొత్త అవకాశాలను అంది పుచ్చుకోవడానికి పోటీని ఎదుర్కోవడానికి, వినూత్న ఆవిష్క రణలకు తెరతీయడానికి తద్వారా సుస్థిరాభివృద్ధి దిశగా ప్రణాళికలు రచించుకోవడానికి మార్గం సుగమమవుతుంది.
విద్యావ్యవస్థను ప్రోత్సహించాలి
యూరప్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశా లతో పోలిస్తే భారత దేశంలో యువత శాతం 35 సంవ త్సరాలలోపు వయసు కలిగిన వారు సుమారు 65 శాతం గా చెప్పొచ్చు. అంటే దేశంలో యువత నూతన నైపుణ్యా లను అందిపుచ్చుకుంటే నైపుణ్యాలతో కూడిన అనుభవాత్మక విద్య మంచి సంభాషణా చాతుర్యం, సహకారం ప్రతిపాదిక తో జట్టు కార్యక్రమాలు వంటి అంశాలను జోడించి వినూత్న విద్యావ్యవస్థను ప్రోత్సహించాలి. నూతన విద్యా విధా నం 2020 ఈ విషయాలకు వెసులుబాటు కల్పించినప్ప టికీ ఆచరణలో, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల అధ్యాపకుల ఎంపికలో, మౌలిక వసతుల కల్పనలో, నిధుల కేటాయింపులో ప్రాధాన్యత లేకపోతే పోటీ ప్రపంచంలో యువత నెగ్గుకు రావడం కష్టతరమే. సాంప్రదాయ రీతి బోధనకు స్వస్తిపలికి కృత్యాధార, డిజిటల్ బోధన, పీర్ లెర్నింగ్, లైబ్రరీ వినియోగం, స్టెమ్ ఆధారిత అనుభవాత్మక విద్యను అందుబాటులో ఉంచడం తప్పనిసరి. ఈ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపుదలలో ప్రభుత్వాలు తగినన్ని నిధులను వెచ్చించి వారికీ వినూత్న బోధన విధానాలపై ప్రత్యేక శిక్షణలు, సేవ్ ది చిల్డ్రన్ (బాల్రక్షా భారత్) వివిధ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా సబ్జెక్టు ఉపాధ్యాయుల నైపుణ్యాలను పంచుకోవడానికి, పెంచుకోవడానికి, ప్రయోగాత్మక విద్యను బోధించడానికి ఏర్పరచిన పెడోగోజికల్ ఫోరంలు, స్టెమ్ ఆధారిత విద్య ప్రయోగ ఫలితాల ఆధారంగా ఏర్పరచిన ఉత్సహవంతులైన సబ్జెక్టు ఆధారిత ఉపాధ్యా యుల పెడోగోజికల్ ఫోరమ్లను ఏర్పరచడం వారికి తగిన శిక్షణ, అదనపు కోర్సులను నేర్చుకొనే వెసులుబాటు కల్పించడం, క్షేత్ర స్థాయి. అవగాహన ద్వారా తద్వారా ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నైపుణ్యాలను అందించి సంసిద్ధపరచడం తప్పనిసరి.

భవితకు భరోసా
మరొక కోణంలోపునాది నుండి నైపుణ్యాలకు తగిన కరికులం, అమలుకు కార్యాచరణ సరిపడినంత వసతుల, అధ్యాపకుల నియామకం, వారికి నిరంతర శిక్షణా తరగతులతో నైపుణ్యాల మెరుగుదల నిరం తర మూల్యాంకనం, పునఃశిక్షణ వంటి కార్యక్రమాలతో యువతకు జవసత్వాలు నింపే, గౌరవప్రదమైన ఉపాధి దొరికే అవకాశాలకు శీకారం చుట్టాలి. అంతేకాదు అందుబాటులో వున్న అవకాశాల గురించి పూర్తి సమాచారాన్ని అందించడానికి తగిన ఏర్పాట్లు చైతన్య కార్యక్రమాలతో యువతను మేల్కొల్పడం, కౌన్సిలింగ్ వంటి ప్రక్రియలతో మార్గదర్శక త్వాన్ని కూడా అందించడం ప్రభుత్వ ప్రధాన భూమికగా గుర్తించాలి. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రచించి యువత భవితకు భరోసా కల్పించాలి. ఈ అంశాలనే పరిగణనలోకి తీసుకొని ఈమధ్యకాలంలో వికసిత్ భారత్ ప్రవేశపెట్టిన అధిష్టాన్ బిల్లు 2025 ప్రకారం ఉన్నత విద్యలో కొన్ని సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, టెక్నికల్ సంస్థలు, ఓపెన్ లేదా దూరవిద్యనందించే విశ్వ విద్యాల యాలు ఒకే గొడుగు క్రిందకుతెచ్చి వికసిత భారత్ అధిష్టాన్ పేరుతో వివిధవిద్యా కౌన్సిళ్లను ఒకే లక్ష్యంతో పనిచేసేలా ప్రతి పాదించింది. ఆయా విద్యా సంస్థలు స్వయంప్రతిపత్తితో వివిధ విభిన్న అంశాలను క్రోడీకరించి యువతకు ఉపకరిం చుకోర్సులను రూపొందించి అమలు చేయడం, పరిశోధనలకు పెద్ద పీట వేయడం, ప్రపంచంలో స్థానికంగా ఉన్న అత్యుత్తమ నమూనాలను ప్రదర్శించి తద్వారా గ్లోబల్, లోకల్ అనే వ్యత్యాసం లేకుండా అర్హులైన అందరికీ అనువైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్గించేలా ప్రణాళిక రచించింది. ఇది ఫలిస్తే భారత దేశం అన్ని రంగాలలోను రాణించి స్వయం సమృద్ధి దిశగా పయనించవచ్చు.
-మల్లాడి శ్రీనగేష్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: