ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై స్పందించారు. ప్రజా సమస్యలను మొదటిలోనే పట్టించుకోకపోతే, అది భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
నేపాల్ ఉదంతం ఒక గుణపాఠం
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్ (Ram Manohar Lohia Medical Institute)వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన యోగి, నేపాల్‌లో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఒక గుణపాఠంగా నిలవాలని అన్నారు. “ఒక చిన్న సమస్యను పక్కన పెట్టడం ఎలా దేశ అభివృద్ధిని ఆపేసిందో నేపాల్ (Nepal) ఉదాహరణ. చిన్న విషయాన్ని అలసత్వంగా తీసుకోవడం ఎంతటి హాని చేస్తుందో అందరూ గమనించాలి” అని పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధుల బాధ్యతలు
యోగి తన ప్రసంగంలో ప్రజా నాయకుల బాధ్యతలను వివరించారు. “ప్రజా ప్రతినిధులుగా మేము ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంటాం. వారి సమస్యలను ఓపికగా విని, సమర్థవంతమైన పరిష్కారాలు చూపించాలి” అని స్పష్టంగా చెప్పారు.
వైద్యుల పాత్రపై హితవు
వైద్య రంగాన్ని ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి హితవు పలికారు.”వైద్యులు తమ రోగులతోనే కాదు, వారి కుటుంబ సభ్యలతో కూడా సున్నితంగా, బాధ్యతతో వ్యవహరించాలి” అని సూచించారు. ఇది వైద్య రంగంపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించేందుకు అవసరమని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: