Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మరోసారి పేరు మార్పు నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. లఖింపూర్ ఖేరి జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామం పేరును “కబీర్ ధామ్” గా మార్చనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా నివసించడం లేదని సమాచారం రావడంతో, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లఖింపూర్ ఖేరిలో జరిగిన విశ్వ కళ్యాణ్ ఆశ్రమంలోని స్మృతి ప్రకటోత్సవ మేళా కార్యక్రమంలో పాల్గొన్న యోగి, గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. “ఇక్కడ ముస్లింలు లేరని తెలుసుకున్నాను, అందుకే ముస్తఫాబాద్ (Mustafabad) పేరును కబీర్ ధామ్‌గా మార్చాలని నిర్ణయించాను” అని ఆయన అన్నారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే అధికారికంగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు.
Read also: Jharkhand Chhath: విషాదంగా మారిన పండుగ ఆనందం..ముగ్గురు చిన్నారులు మృతి

Yogi Adityanath: ముస్లింలు లేరని గ్రామం పేరు మార్పు
అదే వేళ యోగి, గత ప్రభుత్వాల నిర్ణయాలను విమర్శించారు. “మునుపటి పాలకులు ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీయాలని ప్రయత్నించారు. అయోధ్యను ఫైజాబాద్‌గా, ప్రయాగ్‌రాజ్‌ను అలహాబాద్‌గా మార్చారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పాత గౌరవాన్ని తిరిగి తీసుకువచ్చాం” అని వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, ముస్తఫాబాద్ పేరు మార్పుతో ఆ ప్రాంతానికి కొత్త సాంస్కృతిక గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ముస్తఫాబాద్ గ్రామం లఖింపూర్ ఖేరి జిల్లా గోలా గోకరన్ నాథ్ తహసీల్ పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, గ్రామంలో 77 కుటుంబాలు ఉండగా, మొత్తం జనాభా 495. వీరిలో ఎక్కువ మంది హిందూ సమాజానికి చెందినవారే ఉన్నారు.
యోగి ఆదిత్యనాథ్ ఏ గ్రామం పేరు మార్చారు?
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఉన్న ముస్తఫాబాద్ గ్రామం పేరును “కబీర్ ధామ్”గా మార్చాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
పేరు మార్పుకు కారణం ఏమిటి?
ఆ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా నివసించడం లేదని తెలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: