ఇటీవల బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా (Voters’ List) ప్రత్యేక పరిశీలన కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో ఒక ఊహించని అంశం బయటపడింది. ఇందులో పురుషుల కంటే మహిళల ఓట్ల తొలగింపే ఎక్కువ (Women’s vote loss is high) గా జరిగింది. ఇది హిందూ పత్రిక చేసిన విశ్లేషణలో వెల్లడి అయ్యింది.ఈ ఎస్‌ఐఆర్ పరిశీలన ప్రకారం, చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన జాబితాలో 62.6% ఓట్లు మహిళలవే. అదే సమయంలో పురుషుల వాటా కేవలం 37.4% మాత్రమే. అంటే, ప్రతి మూడు మంది తొలగించబడిన ఓటర్లలో ఇద్దరు మహిళలే.హిందూ జర్నల్ అందించిన వివరాల ప్రకారం, 18-39 వయసు మధ్య ఉన్న మహిళలే ఎక్కువగా ఈ తొలగింపులో ఉన్నాయి. పురుషుల కంటే 2-3 రెట్లు అధికంగా మహిళలు తొలగించబడ్డారు. ఇది కేవలం ఓ పొరపాటు కాదని స్పష్టంగా కనిపిస్తోంది.

ఏడు లక్షల మహిళల ఓట్లు ఏకంగా గాలిలోకి?
ఈ ఏడాది జనవరి 1న విడుదలైన ఓటర్ల జాబితాలో, కొత్తగా ఏడు లక్షల మంది మహిళల పేర్లు మాయమయ్యాయి. ఇది కేవలం ఓ గణాంకం మాత్రమే కాదు — రాజకీయంగా, సామాజికంగా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండొచ్చు.తొలగించిన ఓట్ల వెనక ప్రధాన కారణాలు – వేరే రాష్ట్రాలకు వలసలు, మరణాలు, లేదా ఇతర చోట ఓటర్లుగా నమోదవడం. కానీ ఈ కారణాలు పురుషులు, మహిళల మధ్య పెద్దగా తేడా చూపించలేదు. అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల ఫారాలు నింపకపోవడం అనే కారణం కూడా తప్పు. ఎందుకంటే అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ మహిళలే ఎక్కువగా తొలగించబడ్డారు.2011 జనాభా గణాంకాల ప్రకారం, 38.5 లక్షల మంది పురుషులు, 36 లక్షల మందికిపైగా మహిళలు వివాహం, ఉపాధి వంటి కారణాలతో బిహార్‌ను విడిచి వెళ్లారు. కానీ తాజా గణాంకాల ప్రకారం, మహిళల పేర్లే అధికంగా తొలగించబడ్డాయి. ఇది గతంలో పురుషుల ఓట్లు తొలగించి, ఇప్పుడు మహిళలదే టార్గెట్ చేశారన్న అనుమానాన్ని బలపరుస్తోంది.
ఈ తొలగింపు సరైందేనా?
వేరే రాష్ట్రాలకు వెళ్లిన మహిళలు అక్కడ ఓటింగ్ హక్కు పొందారా? లేదా, అలా కాకుండానే వారు తమ ఓటు పూర్తిగా కోల్పోయారా? ఎన్నికల సంఘం దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకం. అలాంటి ఓటును ఎటువంటి నిర్ధారణ లేకుండా తొలగించడం సరైనదా అనే ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ అవసరం. మహిళల ఓట్ల తొలగింపు ఎందుకు ఎక్కువగా జరిగిందన్న అంశంపై పారదర్శకత ఉండాలి. ఇది కేవలం ఓ గణాంకపరమైన తప్పిదంగా కాకుండా, ఓటర్ల హక్కులకు సంబంధించి ఒక పెద్ద న్యాయ, నైతిక ప్రశ్నగా మారింది.
Read Also :