హైదరాబాద్ : పెరుగుతున్న విద్యుత్ (electricity) డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు కొత్త థర్మల్ తో పాటు, ప్రత్యమ్నాయ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా పవన విద్యుత్ ప్రాజెక్టులను కొత్తగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా 2,000 మెగావాట్ల అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థ (ఐఎస్ఎస్)తో అనుసంధానించబడిన పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో పవన విద్యుత్ ప్రాజెక్టు (Wind power project) ల ఇంజనీరింగ్, సేకరణ నిర్మాణం (ఇపిసి) నిమిత్తం తాజాగా టెండర్లను ఆహ్వానించింది. ఈ బిడ్లను ఈ నెల 16 లోపు సమర్పించాలి. అదే తేదీన బిడ్లు తెరుస్తుంది.
పరీక్ష తదితర అంశాలను కూడా పరిగణలోకి
ఇక దీనికి సంబంధించి అర్హలను టెండర్లలో పేర్కొంది. బిడ్డర్లు 100 మెగావాట్ల నుండి 2,000 మెగావాట్ల వరకు సామర్థ్యాలకు కోట్ చేయవచ్చు. దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ (Madhya Pradesh) వంటివనరులు ఉన్న రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులను ప్లాన్ చేసేందుకు ప్రాధాన్యతనిస్తోంది. పవన్ శక్తి ఉత్పత్తి సామర్థ్యం, ఐఎసిఎస్ గ్రిడ్ నెట్వర్కు సామీప్యత ఆధారంగా తుది స్థానాలను గుర్తిస్తుంది.

వీటి పని పరిధిలో సౌర ప్రాజెక్టుల రూపకల్పన, ఇంజనీరింగ్, మైక్రోసిటింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, పరీక్ష తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఎంపిక చేయబడిన బిడ్డర్లు విండ్ టర్బైన్ జనరేటర్లు (డబ్ల్యూటిజి), యూనిట్ సబ్జెస్టేషన్లు, సూపర్వైజరీ కంట్రోల్, డేటా అక్విజిషన్ సిస్టమ్లను అందించడం వంటి వాటిని ఉంటుంది.
సివిల్ పనులను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని
ఇన్స్టాల్ చేయాల్సి అంతేకాకుండా అంతర్గత రోడ్లు, ఆఫీసు కమ్ కంట్రోల్ భవనాలు, పూలింగ్ సబ్ స్టేషన్లు, స్టోరేజ్ షెడ్లు, శాశ్వత నీటి సరఫరా వ్యవస్థలు, అప్రోచ్ రోడ్లు వంటి సివిల్ పనులను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని నిబంధనల్లో స్పష్టం చేసింది. అంతర్గత హైటెన్షన్ ఓవర్ హెడ్ లైన్లు, మీటరింగ్ స్టేషన్లు, అవసరమైన స్విచ్ గేర్ లతో అదనపు హైవోల్టేజ్ సబేస్టేషన్లు,
ఐఎసిఎస్ గ్రిడ్ సబ్ స్టేషన్ (IACS Grid Substation) వరకు బాహ్య ఓవర్ హెడ్ లైన్ల అభివృద్ధితో సహా విద్యుత్ పనులను కూడా పని పరిధిలో ఉంటుంది. పవన్ విద్యుత్ ప్రాజెక్టులను సమీపంలోని ఐఎస్ టిఎస్ సబ్ స్టేషన్ కు అనుసంధానించాలి. బే ఎక్స్ టెన్షన్ లేదా గ్రిడ్ సబ్జెస్టేషన్లో అదనపు సౌకర్యాలకు నిబంధనలు ఉండాలి. పవన్ విద్యుత్ కేంద్రాలు కనీసం 35 శాతం సామర్థ్య వినియోగ లక్ష్యాన్ని సాధించాలని టెండర్లలో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: