జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు మరియు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిహార్ రాష్ట్రంలోని సరన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, తాను ప్రజలను ఓటేయమని (Votes) అడగనని, కానీ వారు ఎవరికి ఓటేయాలో మాత్రం సూచనలు ఇస్తానని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జన సూరజ్ ఉద్యమం
ప్రశాంత్ కిషోర్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న సంకల్పంతో జన సూరజ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. “మీరు ఎవరికీ ఓటేయాలో తెలుసుకోవాలంటే పేదరికం నుంచి బయటపడటానికి మార్గం చూపే నాయకులను ఎంచుకోండి” అని ఆయన సూచించారు. ఉపాధి, విద్య, ఆరోగ్య సదుపాయాలు స్థానికంగానే అందుబాటులో ఉండే విధంగా బిహార్‌ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
5,000 పైగా గ్రామాల్లో పర్యటన
ఇటీవల తన పాదయాత్రను తిరిగి ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు 5,000 పైగా గ్రామాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వారి జీవనశైలిలో మార్పు తీసుకురావాలని కృషి చేస్తున్నారు. సంప్రదాయ రాజకీయ శైలికి భిన్నంగా ప్రజల మధ్య ఉండే నాయకుడిగా తనను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానం ఆయన రాజకీయ భవిష్యత్తును కొత్త దిశగా నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Jyoti Malhotra : జ్యోతిని స్పాన్పర్ చేసిన సంస్థకు అజర్ బైజాన్ తో ఒప్పందం!