భార్య భర్తను హత్య చేసి ప్రియుడికి వీడియో కాల్ – మధ్యప్రదేశ్‌లో సంచలనం
Madhya Pradesh : ప్రేమ పేరుతో భర్తను హత్య చేసిన ఘోర సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకొని దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. షాపూర్ ప్రాంతంలోని ఇండోర్-ఇచ్ఛాపూర్ జాతీయ రహదారిపై ఈ దారుణం జరిగింది. తన ప్రియుడి సహకారంతో కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య, ఈ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా ప్రియుడికి చూపించింది. నిందితురాలితో పాటు ఆమెకి సహాయపడిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.హత్యకు గురైన యువకుడు రాహుల్ (వయస్సు 25) తన భార్యతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఇది జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో ఐటీఐ కాలేజీ సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ వేగం తగ్గగానే, అక్కడే మాటువేసి ఉన్న ఇద్దరు వ్యక్తులు రాహుల్‌పై దాడి చేశారు. రాహుల్‌ను బైక్ నుంచి పడేసి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి, మొదట బీరు బాటిళ్లతో తలపై దెబ్బలుండి, అనంతరం కత్తులతో 36 సార్లు పొడిచి హత్య చేశారు.ఈ హత్యలో shocking గా ఉన్న విషయం ఏమిటంటే, రాహుల్ భార్య తన ప్రియుడితో వీడియో కాల్ ద్వారా ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూపించడం. మూడుగురు కలిసి హత్య చేసిన అనంతరం రైలులో ఇటార్సికి వెళ్లి, అక్కడినుంచి బస్సు మార్గం ద్వారా ఉజ్జయినికి పారిపోయారు.

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – వీడియో కాల్‌లో చూపించి సంచలనం
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, హత్యకు భార్య పాత్ర కీలకమని వెల్లడైంది. పోలీసులు ఆమెతో పాటు మైనర్ బాలుడు మరియు లలిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె ప్రియుడు యువరాజ్ కోసం గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన ప్రేమ, వ్యభిచారం, ద్రోహం అనే భావాల ముసుగులో దాగి ఉన్న అసలు నిజాలను బయటపెట్టింది. కుటుంబ వ్యవస్థపై ఇది తీవ్రమైన దెబ్బగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్త వైరల్ అవుతూ, నిందితురాలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి సంఘటనలు సమాజానికి గుణపాఠం కావాల్సి ఉంది. ప్రేమ అన్నది బాధ్యతగా మారాలేకాని, నేరానికి కారణం కాకూడదు. మహిళ, మైనర్ పాల్గొన్న ఈ ఘటనపై న్యాయస్థానాల్లో విచారణ వేగంగా సాగనుంది.
Read More : Florida University: ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం