బాఘ్‌పత్‌లో భర్తను సజీవదహనం చేసిన భార్య: నలుగురిపై కేసు నమోదు
Murder: ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య అంకిత తన ప్రియుడు అయ్యూబ్ అహ్మద్, మామ సుశీల్, మరియు బేబీ అనే వ్యక్తితో కలిసి భర్త సన్నీని సజీవదహనం చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నలుగురిపై కేసు (Case against four people) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన వివరాలు
Murder: కందేరా గ్రామానికి చెందిన సన్నీకి గతేడాది గర్హీ కంగరాన్ గ్రామానికి చెందిన అంకితతో వివాహమైంది. ఈ నెల 22న కావడీ యాత్రలో భాగంగా గంగాజలం తీసుకురావడానికి సన్నీ బైక్‌పై హరిద్వార్ వెళ్ళాడు. తిరిగి వస్తుండగా, కంగరాన్ గ్రామ రోడ్డు సమీపంలో నలుగురు వ్యక్తులు సన్నీ బైక్‌ను ఆపి అతనిపై దాడి చేశారు.
ఆ తర్వాత నిందితులు సన్నీని అంకిత తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్ళి, అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన సన్నీని (Sunny) మొదట మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ సన్నీ మరణించాడు.
పోలీసుల విచారణ, నిరసనలు
మృతుడి తండ్రి వేద్‌పాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు అంకిత, అయ్యూబ్, బేబీ, సుశీల్‌లపై కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. దీంతో కందేరా గ్రామస్థులు నిరసనకు దిగారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Operation Mahadev: పహల్గాం ఉగ్రవాదులు మావాళ్లే.. అడ్డంగా దొరికిన పాక్