हिन्दी | Epaper

Christmas Cake : ఇండియాలో ఫస్ట్ క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారైంది?

Sudheer
Christmas Cake : ఇండియాలో ఫస్ట్ క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారైంది?

తలస్సేరిలో పుట్టిన మధుర జ్ఞాపకం భారతదేశంలో బేకింగ్ సంస్కృతికి కేరళలోని తలస్సేరి (Thalassery) పురిటిగడ్డగా నిలుస్తుంది. 1883వ సంవత్సరంలో మాంబల్లి బాపు అనే వ్యక్తి ‘రాయల్ బిస్కెట్ ఫ్యాక్టరీ’ని స్థాపించి, దేశంలోనే తొలిసారిగా క్రిస్మస్ కేక్‌ను తయారు చేశారు. అప్పట్లో ఒక బ్రిటిష్ ప్లాంటర్ తలస్సేరి సందర్శనకు వచ్చినప్పుడు, తన వద్ద ఉన్న రిచ్ ఫ్రూట్ కేక్ ముక్కను బాపుకు ఇచ్చి, అచ్చం అలాగే కేక్ తయారు చేయగలరా అని అడిగారు. అప్పటి వరకు కేవలం బిస్కెట్లు, బ్రెడ్ మాత్రమే తెలిసిన బాపు, ఆ సవాలును స్వీకరించి భారతదేశపు మొట్టమొదటి ప్లమ్ కేక్‌కు ప్రాణం పోశారు.

Vande Bharat sleeper train : వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…

దేశీయ రుచుల మేళవింపు – వెస్టర్న్ బేకింగ్ బ్రిటిష్ వారు ఉపయోగించే విదేశీ పదార్థాలకు బదులుగా, బాపు మన స్థానిక వనరులను ఉపయోగించి ఈ కేక్‌ను మరింత రుచికరంగా తీర్చిదిద్దారు. యూరోపియన్ రెసిపీలో ఉండే బ్రాందీ లేదా వైన్‌కు బదులుగా, స్థానిక జీడిమామిడి పండ్ల నుండి తీసిన రసాన్ని (Cashew Apple Brandy) ఉపయోగించారు. అలాగే స్థానిక సుగంధ ద్రవ్యాలను చేర్చడం ద్వారా ఆ కేక్‌కు ఒక ప్రత్యేకమైన ఘుమఘుమలు వచ్చాయి. వెస్టర్న్ బేకింగ్ పద్ధతులను అనుసరిస్తూనే, భారతీయుల అభిరుచికి తగ్గట్లుగా చేసిన ఈ మార్పులు కేరళ ప్లమ్ కేక్‌ను అత్యంత ప్రజాదరణ పొందేలా చేశాయి.

వారసత్వంగా మారిన క్రిస్మస్ కల్చర్ ఒకప్పుడు కేవలం తలస్సేరిలోని ఒక చిన్న బేరీలో మొదలైన ఈ క్రిస్మస్ కేక్ సంస్కృతి, కాలక్రమేణా దేశవ్యాప్తంగా విస్తరించింది. అప్పట్లో కేవలం క్రిస్మస్ పండుగ సమయంలో మాత్రమే లభించే ఈ కేక్, నేడు ప్రతి వేడుకలోనూ అంతర్భాగమైపోయింది. మాంబల్లి బాపు వేసిన పునాదితో కేరళ ‘బేకింగ్ హబ్’గా మారి, వేల సంఖ్యలో బేకరీలు వెలిశాయి. నేడు మనం ఆస్వాదిస్తున్న ప్లమ్ కేక్ వెనుక 140 ఏళ్ల నాటి శ్రమ, సృజనాత్మకత మరియు భారతీయ రుచుల మేళవింపు దాగి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

📢 For Advertisement Booking: 98481 12870