బీజేపీ తనను రాజకీయంగా ఓడించలేకపోయిందని పశ్చిమబెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా, ‘బీజేపీ కమిషన్’లా మారిందని ఆరోపించారు. బొంగావ్‌లో జరిగిన యాంటీ-SIR సభలో ఆమె మాట్లాడుతూ, బిహార్‌లో NDA రూపొందించిన వ్యూహాన్ని ప్రతిపక్షాలు ముందుగానే అంచనా వేయలేదని అభిప్రాయపడ్డారు.
Read Also: Bihar Results: బీహార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు నాయకుల సస్పెండ్

అంత త్వరగా SIR నిర్వహించాల్సిన అవసరం ఏమిటో ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఓట్ల పట్టిక ఖచ్చితంగా లేకపోతే, 2024లో బీజేపీ సాధించిన విజయాన్ని కూడా నమ్మలేమని ఆమె పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: