బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో రెండు తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిజిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా వర్షాలు పడ్డాయి. గత రెండురోజులుగా వాతావరణం కాస్త కుదటపడినట్లుగా కనిపిస్తున్నది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలో వర్షబీభత్సతం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాలో భారీ
వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.

అతలాకుతలమైన రాజస్థాన్
నేడు రాజస్థాన్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తుండటంతో ఆయా జిల్లాలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ చేసింది. ఉదయం నుంచే రాజస్థాన్లో (Rajasthan) వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అంతేకాక ఐదురాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు అధికారులు. తూర్పురాజస్థాన్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. దీనికారణంగా అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఐదురాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో ఉదయం కాశంలో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. నేడు, రేపు ఢిల్లీ ఎన్సీఆర్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తారు. చేపలవేటకు వెళ్లే మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: RBI : ఆర్బీఐకి తలనొప్పిగా మారిన ఈ భారీ డిపాజిట్లు!