हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Waqf – ‘వక్ఫ్’లో కొన్ని సవరణలపై స్టే చాలునా?

Sudha
Latest Telugu news : Waqf – ‘వక్ఫ్’లో కొన్ని సవరణలపై స్టే చాలునా?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన వస్స్సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని సవరణలు రాజ్యాంగ వ్యతిరేక మైనవని భావిస్తూ వాటి అమలును నిలిపివేస్తూ స్టే (Stay)విధించింది. కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (Waqf)ను రూపొందించ గలరనే నిబంధన కూడా స్టే విధించిన జాబితాలో ఉంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన ఆస్తుల పరిరక్షణ పేరుతో చేసిన సవరణలు ఇప్పుడు రాజ్యాంగ బద్ధతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పిటిషన్లు వక్ఫ్ (Waqf)చట్టం 2025ను రద్దు పరచాలని కోరుతూ దాఖలు అయ్యాయి. పిటిషనర్లు వాస్తవానికి మొత్తం చట్టాన్నే కొట్టివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేవలం రాజ్యాంగ బద్ధతను పాటించని సెక్షన్లను మాత్రం నిలిపివేయాలని ఆదేశించింది. చట్టం రాజ్యాంగ బద్ధతకు ఊహ ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుందని, అరుదైన సందర్భాలలో మాత్రమే జోక్యం చేసుకోవచ్చని మేము భావిస్తున్నాము అని ధర్మాసనం పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల స్థితిని నిర్ణయించడానికి కలెక్టర్కు ఇచ్చిన అధికారాలపై కూడా సుప్రీంకోర్టు స్టే విధిం చింది. వక్ఫ్ బోర్డులో ముస్లింయేతరుల భాగస్వామ్యం అనే వివాదాస్పద అంశంపై తీర్పునిస్తూ సెంట్రల్ వక్స్ కౌన్సిల్ లో ఉండే 20 మందిలో నలుగురు కంటే ఎక్కువ మంది ముస్లింయేతర సభ్యులు ఉండకూడదని, రాష్ట్ర వక్స్ బోర్డు లలో 11 మందిలో ముగ్గురు కంటే ఎక్కువ ముస్లింయేతర సభ్యులు ఉండకూడదని ఆదేశించింది. కొత్త చట్టంలోనిప్రతి విభాగానికి ‘ప్రాథమిక అడ్డంకి’ సవాలు)గా ధర్మాసనం పరి గణించింది. చట్టంలోని మొత్తం నిబంధనలను నిలిపివేయడానికి ఎటువంటి కేసును రూపొందించలేదని ధర్మాసనం పేర్కొంది. అయితే ఇందులోని కొన్ని విభాగాలకు కొత్త రక్షణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది.

Waqf -   'వక్ఫ్'లో కొన్ని సవరణలపై స్టే చాలునా?
Waqf – ‘వక్ఫ్’లో కొన్ని సవరణలపై స్టే చాలునా?

సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రాథమికంగానూ, తాత్కాలికంగానూ ఉన్నా యనీ తుది విచారణలో చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై పిటిషనర్లు లేదా కేంద్రప్రభుత్వం పూర్తి వాదనలు ముందుకు తీసుకెళ్లకుండా అవి నిరోధించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నాడా లేదా అని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ నియమాలను రూ పొందించేవరకూ వక్ఫ్(సెక్షన్ 3(ఆర్) ఆస్తిని అంకితం చేయ డానికి ముందు గత ఐదుసంవత్సరాలుగా ముస్లిం మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తి అయి ఉండాలి అనే నిబంధన ఏకపక్ష అధికార వినియోగానికి దారితీస్తుంది అని సుప్రీం కోర్టుఉత్తర్వుల్లో పేర్కొంది. వక్స్ ఆస్తుల స్థితిని నిర్ధారించడానికి నియమించబడిన ప్రభుత్వ అధికారులకు ఉన్న అధికారాలకు సంబంధించి ఉన్న సెక్షన్ 3(సి)కి సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయంపై సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రభుత్వ అధికారి నివేదిక ప్రకారం ఒక భూమి ఆక్ర మణ కాదనినిర్ధారించే వరకూ ఆస్తిని (Waqf) గా పరిగణించ రాదని చట్టంలోని సెక్షన్ 3సి(2) నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఒక ఆస్తిని ప్రభుత్వ భూమిగాప్రకటించ డానికి, రెవెన్యూ రికార్డులను మార్చడానికి అధికారికి ఇచ్చిన అధికారానికి సంబంధించిన సెక్షన్ 3సి(3)పైన కూడా స్టే విధించింది.అధికారి కనుగొన్న దాని ఆధారంగా దాని రికార్డులను సరిచేయమని రాష్ట్ర ప్రభుత్వం వర్ఫ్ బోర్డును ఆదేశించాల్సిన సెక్షన్ 3సి(4)ను కూడా సుప్రీంకోర్టు నిలిపి వేసింది. కలెక్టర్ హక్కులను నిర్ణయించడానికి అనుమతించడం, అధికారాల విభజనకు విరుద్ధం. కార్య నిర్వాహణాధి కారి పౌరుల హక్కులను నిర్ణయించడానికి అనుమతించబడ దు అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. వక్ఫ్ ట్రిబ్యునల్న్సక్షన్ 83 ప్రకారం ఆస్తిపై హక్కును, కోర్టుల్లో చివరి తీర్పువచ్చే వరకూ లేదా హైకోర్టులో అప్పీల్కు లోబడి ఉండేవరకూ వర్ఫ్ స్వాధీనం లేదా దాని రికార్డులు ఏవీ ఇబ్బంది కలిగిం చవని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే విచారణ పెండింగ్లో ఉన్న సమయంలో అటువంటి ఆస్తుల విషయంలో మూడవ పక్ష హక్కులను సృష్టించలేమని సుప్రీంకోర్టు
పేర్కొంది. వర్ఫ్ బోర్డులలో ముస్లింయేతర భాగస్వామ్యంపై నిబంధనలను నిలిపివేయడానికి ధర్మాసనం నిరాకరించింది. కానీ పరిమితులను విధించింది. ముస్లిం దాని వ్యక్తులకు వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఒ)గా అవకా శం ఇవ్వొచ్చంటూ చట్టంలో చేసిన సవరణపై స్టే’ విధించలేమని ధర్మాసనం పేర్కొంది. సాధ్యమైనంత వరకూ ముస్లింలకే ఆ పదవిని కేటాయించాలని ప్రభుత్వానికి సూ చించింది. చీఫ్ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ల నియామకానికి సం బంధించిన సెక్షన్ 23పై ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యా నించింది. ‘సాధ్యమైనంతవరకు బోర్డుకు చెందిన ఎక్స్ఆఫీసియో కార్యదర్శి అయిన సిఇఒను ముస్లిం సమాజం నుంచి నియమించడానికి ప్రయత్నించాలి అని పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల నమోదును తప్పనిసరి చేసే నిబంధనలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇది ప్రస్తుత కొత్త అవసరం కాదనీ, 1995, 2013 నాటి మునుపటి చట్టాల ప్రకారం ఉందని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్అంటే మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థలను నిర్మించడం వంటి ధార్మిక లేదా మతపరమైన ప్రయోజనాల కోసం ముస్లింలు చేసిన దానం అని అర్థం. ఎక్స్ అఫీసియో సభ్యులు మినహా ముస్లింలు మాత్రమే పనిచేయాలనివారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఈ తీర్పు ద్వారా రాజ్యాంగ వ్యవస్థలు ఏవైనా సరే అవి రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా నడుచుకోకపోతే సహించేది లేదని సుప్రీంకోర్టు విస్పష్టంగా తెలియచెప్పింది. జిల్లా కలెక్టర్లు సర్వాధికారులు కారనీ, వారు ఏది నిర్ణయిస్తే అది అంతిమం అవుతుందనే విషయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కార్యనిర్వాహకవర్గం కూడా రాజ్యాంగ బద్ధమైంది కాబట్టి రాజ్యాంగ నియమాలన్నీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు ఈతీర్పు ద్వారా స్పష్టపరిచిం ది. ఒక ఆస్తి భూమి కానీ మరేదైనా కావచ్చు. వక్ఫ్ ఆస్తి అని ముస్లింల వాదన ఒక వైపు, అది ప్రభుత్వ స్థలమనీ మరొకవైపు ఉన్నప్పుడు కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇవ్వడా నికి వీలులేదని సుప్రీంకోర్టు స్పష్టపరిచింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ఇద్దరు మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి అవుతుంది. ఆ మహిళలు కూడా ముస్లింలు అయి ఉండాలి. వక్స్ బిల్లును పరిశీలించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటయింది. వక్ఫ్ చట్టంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నందువలన వాటి పైన మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించి, ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం చట్టాన్ని కొట్టివేయాలని పిటిషనర్లు కోరినా సుప్రీంకోర్టు నిరాకరించడం గమనార్హం. మత వ్యవహారాల లో ప్రభుత్వాలు ఇష్టానుసారం వ్యవహరిం చడానికి వీలు లేదని మాత్రం స్పష్టపరిచింది. అధికార విభజనల బదలాయింపు సూత్రాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం కూడా కుదరదని తేల్చి చెప్పింది. ఈ తీర్పు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది.

-జాన్ బర్న్స్ చిమ్మె

వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి?

వక్ఫ్ బోర్డు అనేది ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన, పవిత్రమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేయబడిన వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యత కలిగిన చట్టపరమైన సంస్థ.

వక్ఫ్ బోర్డు సమస్య ఏమిటి?

భారతదేశంలో వక్ఫ్ వ్యవస్థను తరచుగా మతపరమైన విషయంగా చూస్తారు, కానీ వాస్తవానికి ఇది ప్రధానంగా ఆస్తి నిర్వహణ, పరిపాలన మరియు పాలనకు సంబంధించినది. వక్ఫ్ చట్టం, 1995 మరియు దాని సవరణలు వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంపై దృష్టి సారించి, వాటిని సరిగ్గా ఉపయోగించడం మరియు నిర్వహించడం జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870