
Viral Video: గుజరాత్‌లోని వల్సాడ్‌లో ఒక వ్యక్తి ఊహించని ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అపార్ట్‌మెంట్‌లో ఆయన వాడుతున్న లిఫ్ట్ సాంకేతిక లోపంతో ఒక్కసారిగా మొరాయించడంతో ఈ ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఈ భయానక దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Read Also: Iran Israel War:83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర
క్షణాల వ్యవధిలో పెను ప్రమాదం
తొమ్మిదో అంతస్తులో నివసించే ఒక వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. సుమారు 35 సెకన్ల ప్రయాణం తర్వాత లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకుంది. తలుపులు తెరుచుకోవడంతో ఆయన బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఆ వ్యక్తి లిఫ్ట్ నుంచి పూర్తిగా బయటకు రాకముందే, డోర్లు తెరిచి ఉండగానే లిఫ్ట్ ఒక్కసారిగా వేగంగా పైకి కదలడం ప్రారంభించింది. ఇది గమనించిన ఆయన వెంటనే వెనక్కి తగ్గి బయటకు దూకేశారు. ఒకవేళ మరో సెకను ఆలస్యమై ఉంటే లిఫ్ట్‌కు, ఫ్లోర్‌కు మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయే వారు. ఈ క్రమంలో ఆయన తల లిఫ్ట్ డోర్‌కు బలంగా తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే ఆ లిఫ్ట్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: