తమిళనాడులోని కరూర్‌లో టీవీకే (తమిళగ వెట్రికళగం) పార్టీ (TVK Party) నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు (CBI investigation) జరపాలని కోరుతూ సినీ నటుడు విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Tej Pratap – లక్ష్మణుడి మాదిరిగా తేజస్వీ యాదవ్ వ్యవహరించాలి: తేజ్ ప్రతాప్
అయితే,విజయ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు (Madras High Court) కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై మదురై బెంచ్ విచారణ జరిపింది.ఈ సందర్భంగా ధర్మాసనం విజయ్ మరియు ఆయన పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ ఘటన (Karur incident) పై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తు చేసింది.
ఈ సమయంలోనే సీబీఐ దర్యాప్తు కోరడం సముచితం కాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. ఇదే అంశంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జీఎస్ మణి (GS Mani) దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది.

భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు
విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు వంటి ప్రాథమిక సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ప్రజల ప్రాణాల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) కోర్టుకు తెలియజేసింది.
సతీశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది
ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నమక్కల్ జిల్లా కార్యదర్శి సతీశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జనసమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: