తమిళ సినీ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్( Vijay) తిరిగి తన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. కాంచీపురం జిల్లాకు చెందిన మూడు తాలూకాల పార్టీ కార్యకర్తలను ఆయన ఇటీవల గోప్యంగా సమావేశపరిచినట్టు తెలిసింది. కరూర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తర్వాత సుమారు మూడు నెలలుగా నిలిచిన ప్రచారాన్ని ఎలా పునఃప్రారంభించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
Read Also: TG: టూరిస్టులకు గుడ్‌న్యూస్.. కృష్ణమ్మపై లాంచీ ప్రయాణం!

భద్రతా చర్యలపై విజయ్ కీలక సూచనలు
పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, రాబోయే కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను విజయ్( Vijay) ఈ సమావేశంలో అందించినట్లు సమాచారం. ముఖ్యంగా కరూర్ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కార్యకర్తలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల భద్రతనే అత్యంత ప్రాధాన్యంగా చూడాలని కూడా ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.
కరూర్ ఘటన తర్వాత జాగ్రత్తగా ముందుకు అడుగులు
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని TVK పార్టీని ప్రారంభించిన విజయ్, కరూర్‌లో జరిగిన తొలి భారీ సభలో భారీ విషాదం తలెత్తడంతో ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. అనంతరం డిసెంబర్ 4న సేలంలో ర్యాలీకి అనుమతి కోరినా, పోలీసులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :