Vijay: విజయ్ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పాల్గొంటుందని అధికారికంగా ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపకుడైన నటుడు విజయ్ (vijay) ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు మహాబలిపురంలోని ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించబడింది. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,000 పైగా సభ్యులు హాజరయ్యారు. సెప్టెంబర్ 27న కరూర్ ర్యాలీలో జరిగిన 41 మంది మరణాలను జ్ఞాపకార్ధం రెండు నిమిషాల మౌనంతో ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని పార్టీ స్పష్టం చేసింది.
Read also: Lawrence Bishnoi: పంజాబ్ కబడ్డీ ప్లేయర్ని కాల్చి చంపిన బిష్ణోయ్

Vijay: ఒంటరిగానే టీవీకే పోరు..
Vijay: ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి 12 కీలక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని డీఎంకే, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తమిళుల ప్రయోజనాలను రక్షించడంలో విఫలమయ్యాయని విమర్శించింది. మహిళల భద్రత, ధాన్యం సేకరణలో జాప్యం, పంట సమస్యలు, పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగ కల్పన వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని పార్టీ కోరింది. అన్ని ఎన్నికల నిర్ణయాల అధికారం కేవలం విజయ్‌కు మాత్రమే ఉంటుందని, 2026 ఎన్నికల్లో టీవీకే పార్టీ సొంత కూటమికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: