వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK పార్టీ ఓటమి తప్పదని TVK పార్టీ (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ (Vijay) అన్నారు.. ఇటీవల కరూర్‌లో జరిగిన తొక్కిసలాట తరువాత మొదటిసారి ఆయన కాంచీపురంలో ప్రజాసభలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.
Read Also: IndiaJobs Report: తెలంగాణ–ఏపీ మహిళలు టాప్ 4లో: దేశంలో 56.35% మందికి ఉద్యోగ నైపుణ్యాలు

డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది
DMK తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని (Vijay) స్పష్టం చేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం (DMK) అవినీతికి పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు.కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీవీకే పార్టీని స్థాపించిన విజయ్.. కరూర్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
అయితే తొలి ర్యాలీలోనే తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో దాదాపు మూడు నెలలుగా ప్రచారం నిలిచిపోయింది. ఈ క్రమంలో డిసెంబర్ 4న సేలంలో ప్రచార ర్యాలీ కోసం టీవీకే.. పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: