రైల్వే శాఖ నుంచి వందేభారత్ స్లీపర్(Vande Bharat Sleeper) రైళ్లపై ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ అధికారికంగా వెలువడింది. పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ కాన్సెప్ట్‌తో అత్యాధునిక సదుపాయాలు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో రూపొందించిన వందేభారత్ స్లీపర్ రైలు తొలి ప్రయాణానికి తేదీ ఖరారైంది. దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలోనే తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రైట్స్ అనుమతి కూడా లభించింది.
Read Also: Manish Tewari : ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదు :మనీశ్ తివారీ
బడ్జెట్ తరహా స్లీపర్ సౌకర్యాలు
బడ్జెట్ తరహా స్లీపర్ సౌకర్యాలు కలిగిన ఈ కొత్త వందేభారత్ రైలు డిసెంబర్ 25న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 2019లో లాంచ్ అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి విపరీత ఆదరణ లభించడంతో, దేశంలో ఇప్పటికే 100 పైగా వందేభారత్ రైళ్లు దూసుకెళ్తున్నాయి.

బెంగళూరు(Bangalore)లోని బీఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైన ఈ స్లీపర్ రైలు ట్రయల్ రన్ కోసం డిసెంబర్ 12న నార్తర్న్ రైల్వేకు అప్పగించనున్నారు. 16 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో మొత్తం 827 బెర్త్‌లు ఉంటాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా, అదనపు భద్రత కోసం ‘కవచ్’ సిస్టమ్‌ని అమర్చారు. రాత్రిపూట ప్రయాణించే వారికి హోటల్ స్థాయి కంఫర్ట్ అందేలా డిజైన్ చేశారు.
వందేభారత్ స్లీపర్‌ను ఢిల్లీ–పాట్నా రూట్
మొదటి వందేభారత్ స్లీపర్‌ను ఢిల్లీ–పాట్నా రూట్‌పై నడిపేలా ప్రణాళిక సిద్ధమైంది. ఆటోమేటిక్ డోర్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ సెక్యూరిటీ, రీడింగ్ లైట్లు, ప్రీమియమ్ ఇంటీరియర్‌లతో రైలును తీర్చిదిద్దారు. ఈ రైలు వారంలో ఆరు రోజులపాటు నడిచే అవకాశం ఉంది. పట్నా రాజేంద్రనగర్ టెర్మినల్ నుండి సాయంత్రం బయలుదేరి, తెల్లవారే సరికి ఢిల్లీ చేరుతుంది.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కూడా వందేభారత్ స్లీపర్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్–ఢిల్లీ, విజయవాడ–అయోధ్య, విశాఖపట్నం–తిరుపతి రూట్‌లకు రైళ్ల కేటాయింపుపై రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఒక రూట్‌కు వచ్చే వారం అధికారిక గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: