Vande Bharat: ప్రతిరోజూ లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు భారత రైల్వే తరచుగా కొత్త సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి చలితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చలి కారణంగా స్నానం చేయలేకపోవడం చాలామందికి అసౌకర్యంగా మారుతోంది.
Read Also: Weather: తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి

వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రయాణికులు రైలులోనే వేడి నీటితో స్నానం చేసే సౌకర్యాన్ని పొందబోతున్నారు. ప్రత్యేకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat) రైళ్లలో ఈ సదుపాయం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి కశ్మీర్ వెళ్లే వందే భారత్ రైల్లో ప్రయాణించే వారికి హాట్ వాటర్ షవర్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఫస్ట్ ఏసీ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ హాట్ షవర్ సదుపాయం ఇప్పటికే రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, అలాగే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లలోని ఫస్ట్ ఏసీ కోచ్‌ల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ నిర్ణయం ద్వారా చలి కాలంలో దీర్ఘకాలిక రైలు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: