భీమవరం : దేశంలోనే తొలి సారిగా లూప్ లైన్లో భారత్ ఎక్స్ ప్రెస్ నడిపేందుకు అనుమతి లభించిందని,(Vande Bharat) 12 నుండి చెన్నై(Chennai) నుండి నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటు లోకి వస్తాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. సోమవారం భీమవరంలోని విలేక రుల ఆయన మాట్లాడుతూ చెన్నై నుండి విజయవాడ వరకు నడిచే వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తూ ఉత్త ర్వులు వచ్చిన వారం రోజుల్లోనే ప్రారంభించా లని భావించామని అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందులు, ఆ రైలుకు ముందస్తు రిజర్వేషన్ల ప్రయాణికులు చేయించుకోవడం వల్ల జనవరి 12 నుండి నర్సాపురం నుండి వందే భారత్ నడపడానికి నిర్ణయించామని కేంద్ర మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలోని తాడేపల్లి గూడెం, భీమవరం, నర్సాపురం రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ఇప్పటికే మంజూరైన 95.44 కోట్ల రూపాయల పనులతో పాటు, తాను అదనంగా ప్రతి పాదనలు పంపి మరో 47.31 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించానని శ్రీనివాస వర్మ తెలిపారు.
పైరసీ కేసులో రవి ఇమ్మడి కథ — పోలీసుల విచారణలో ఆసక్తికర వివరాలు

భీమవరం–ఆకివీడు స్టేషన్లలో లిఫ్ట్ నిర్మాణ పనులు ఫిబ్రవరిలో పూర్తికానున్నాయి
భీమవరం జంక్షన్, ఆకివీడు రైల్వే స్టేషన్లలో(Vande Bharat) ఫిబ్రవరి చివరి నాటికి లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తవు తాయని తెలిపారు. అలాగే వీరవాసరం, అత్తిలి రైల్వే స్టేషన్లలో కూడా లిఫ్టు నిర్మించాలని ప్రతిపాదన పంపక అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించి నట్లు తెలిపారు. నర్సాపురం నుండి అరుణా చలం వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును రెగ్యులర్ చేయడా నికి రైల్వే అధికారులు అంగీకరించారని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విశాఖపట్నం- వారణాసి ఎక్స్ ప్రెస్ నర్సా పురం వరకు పొడిగింపు, పగటిపూట నర్సాపురం నుండి విశాఖకు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. నర్సాపురం నుండి బెంగ ళూరుకు రెగ్యులర్ రైలు, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్కు తాడేపల్లిగూడెంలో హాల్ట్. ఈ ప్రతిపాదనలన్నీ త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: