భారత రైల్వేల్లో రైళ్ల ఆలస్యం సర్వసాధారణంగా మారినప్పటికీ, ఓ విద్యార్థినికి ఇది జీవితాన్ని మార్చేసే నష్టంగా మారింది. రైలు ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేకపోయిన విద్యార్థినికి రూ.9.10 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ రైల్వేలను ఆదేశించింది.
Read Also:School: చిత్తు కాగితాల్లోనే స్కూల్ పిల్లలకు భోజనం.. ఎక్కడంటే?

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. పికోరా బక్ష్ మొహల్లా ప్రాంతానికి చెందిన సమృద్ధి అనే విద్యార్థిని బీఎస్సీ బయోటెక్ పరీక్ష రాయడానికి లక్నో వెళ్లాల్సి వచ్చింది. ఆమె పరీక్ష కేంద్రాన్ని జయనారాయణ్ పీజీ కాలేజీగా కేటాయించారు.
ఆలస్యమైన ఇంటర్‌సిటీ రైలు
పరీక్షకు హాజరయ్యేందుకు సమృద్ధి బస్తీ నుంచి లక్నోకు వెళ్లే ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ రైలులో టికెట్ బుక్ చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం రైలు ఉదయం 11 గంటలకు లక్నో చేరాల్సి ఉండగా, రెండున్నర గంటల ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమె పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకోగా, అప్పటికే పరీక్ష ప్రారంభమై ఉండటంతో హాజరు కాలేకపోయింది.
ఒక సంవత్సరం నష్టం.. న్యాయపోరాటం
రైలు ఆలస్యం కారణంగా పరీక్ష మిస్ కావడంతో(Uttarpradesh) సమృద్ధి ఒక పూర్తి విద్యా సంవత్సరం కోల్పోయింది. దీనిపై ఆమె వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. రైల్వే శాఖ, జనరల్ మేనేజర్, స్టేషన్ సూపరింటెండెంట్‌లకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు.
7 ఏళ్ల తర్వాత తీర్పు
ఈ కేసు ఏడేళ్లకు పైగా కొనసాగింది. రెండు పక్షాల వాదనలు విన్న కమిషన్, రైలు ఆలస్యానికి రైల్వేలు బాధ్యత వహించాల్సిందేనని తేల్చింది. ఆలస్యానికి సరైన కారణాలు వెల్లడించలేదని పేర్కొంది. జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ న్యాయమూర్తి అమర్‌జీత్ వర్మ, సభ్యులు అజయ్ ప్రకాష్ సింగ్‌లు రైల్వేలకు జరిమానా విధించారు. బాధిత విద్యార్థినికి రూ.9,10,000 పరిహారం 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే ఆ మొత్తంపై 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: