
ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌కు ఘటన జరిగిన విషయం తెలిసినా కావాలనే వాహనం ఆపలేదా? లేక ప్రమాదం జరిగినట్లు గుర్తించలేదా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రాథమికంగా నిర్లక్ష్య డ్రైవింగ్(UttarPradesh) కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Read Also: Medak: ఫించన్ సొమ్ము కోసం తల్లిని చంపేసి కొడుకు
ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇంత అమానుషంగా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లడం పట్ల వారు షాక్‌కు గురయ్యారు. ఘటన సమయంలో కారుపై ఏర్పడిన రక్తపు మరకలు, దెబ్బతిన్న భాగాలు ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.
మృతుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం(UttarPradesh) ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: