हिन्दी | Epaper

Latest Telugu news : Landslides -ప్రకృతి విలయంలో ఉత్తరాఖండ్‌.. విరిగిపడిన కొండచరియలు..

Sudha
Latest Telugu news : Landslides -ప్రకృతి విలయంలో ఉత్తరాఖండ్‌.. విరిగిపడిన కొండచరియలు..

ప్రకృతి విలయంతో ఉత్తరాఖండ్‌ అల్లాడుతున్నది. చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. (Landslides) దీంతో నాలుగు గ్రామాల్లో 30కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 మంది గాయపడగా 14 మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద వారు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గురువారం భారీ వర్షం కారణంగా వరదలు (floods) సంభవించాయి. దీంతో చమోలి జిల్లాలోని నాలుగు గ్రామాల్లో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. 30కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 20 మంది గాయపడ్డారు. 14 మంది జాడ కనిపించడం లేదు. దీంతో అదృశ్యమైన వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

Landslides -ప్రకృతి విలయంలో  ఉత్తరాఖండ్‌.. విరిగిపడిన కొండచరియలు..
Landslides -ప్రకృతి విలయంలో ఉత్తరాఖండ్‌.. విరిగిపడిన కొండచరియలు..

కాగా, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తలకు గాయమైన చిన్నారితో సహా తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

ఉత్తరాఖండ్లో ఎన్ని కొండచరియలు విరిగిపడ్డాయి?

1988 మరియు 2023 మధ్య, ఉత్తరాఖండ్‌లో 12,319 కొండచరియలు విరిగిపడటం నమోదైంది. అయితే, ఇటీవల ఈ సంఖ్య పెరిగింది: 2018: 216 కొండచరియలు విరిగిపడటం. 2019: 254 కొండచరియలు విరిగిపడటం.

2025 లో ఉత్తరాఖండ్లో ఎంత మంది మరణించారు?

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ మరియు పరిసర ప్రాంతాలలో మంగళవారం (సెప్టెంబర్ 16, 2025) రాత్రిపూట కుండపోత వర్షం మరియు వరదలు విధ్వంసం సృష్టించడంతో కనీసం 13 మంది మరణించారు మరియు 16 మంది గల్లంతయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/air-travel-should-be-accessible-to-the-common-man/national/549566/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

📢 For Advertisement Booking: 98481 12870