ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం పెళ్లి వేడుకలో ఉన్న కుటుంబాలకు అతి పెద్ద విషాదాన్ని మిగిల్చింది.(Uttar Pradesh) సుబోధ్ కుమార్ అనే యువకుడు తన పెళ్లి కోసం ఊరేగింపుగా వెళ్తుండగా, అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వంతులు రావడంతో వాహనంలో నుంచి దిగిన అతడిని ఒక వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టి వెళ్లింది.
Read also: అన్నీ ఫ్రీగా ఇచ్చే సూపర్ మార్కెట్ ఎక్కడంటే?

పెళ్లి వేడుక విషాదంలోకి మారింది
ఈ ప్రమాదం(Uttar Pradesh) బినౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిచోక్రా గ్రామానికి సమీపంలో చోటుచేసుకుంది. సుబోధ్ కుమార్ తన కుటుంబంతో సహా వధువు గ్రామం సరూర్‌పూర్ కలన్ వైపు వెళ్తుండగా, మధ్యలో ఆగి స్నాక్స్ కోసం పంచాయతీ ఆఫీస్ వద్ద ఆగాడు. వాంతులు రావడంతో వాహనం నుండి దిగిన సుబోధ్‌ను ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి(hospital) తరలించగా, వైద్యులు అతడి మృతి ధృవీకరించారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పరారైన ట్రక్క్ డ్రైవర్‌ను గుర్తించేందుకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
కుటుంబాలపై తీవ్ర మానసిక ప్రభావం
అప్పటి వరకూ సంతోషంగా జరుపుకుంటున్న ఇరు కుటుంబాలపై ఈ సంఘటన తీవ్రమైన మానసిక దెబ్బ తగిలింది. వరుడి అనూహ్య మృతి వల్ల పెళ్లి వేడుక పూర్తిగా విషాదంగా మారింది. ఈ ప్రమాదం ఊరులోని ఇతర కుటుంబ సభ్యులలోనూ తీవ్ర ఆందోళన కలిగించింది.అప్పటి వరకూ సంతోషంగా జరుపుకుంటున్న ఇరు కుటుంబాలపై ఈ సంఘటన తీవ్రమైన మానసిక దెబ్బ తగిలింది. వరుడి అనూహ్య మృతి వల్ల పెళ్లి వేడుక పూర్తిగా విషాదంగా మారింది. ఈ ప్రమాదం ఊరులోని ఇతర కుటుంబ సభ్యులలోనూ తీవ్ర ఆందోళన కలిగించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: