ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. “జంపింగ్ జపాంగ్” అన్న పదం ఇవాళ జనాల్లో మాటల్లో వినిపిస్తున్నది. మొన్నటి వరకూ కూతురికి కాబోయే భర్తతో పరారైన మహిళ వార్తల్లో నిలవగా, ఇప్పుడు మరో ఘటన – కూతురు మామతో పరారైన తల్లి కలకలం రేపుతోంది.
అలీగఢ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతురికి కాబోయే వరుడితో పరారైన ఘటన పెద్ద దుమారమే రేపింది. ఇది ఏకకాలంలో కుటుంబ విలువలపై, సామాజిక పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. కన్యాదానం చేయాల్సిన వయస్సులో ఆ మహిళ తన కూతురికే కాకుండా కుటుంబానికే భిన్నమైన షాక్ ఇచ్చింది. ఆ వాడే నా జీవితం, అతనితోనే ఉంటాను అనే తలుపు మూసే ప్రకటనతో ఆమె వ్యవహారాన్ని ముగించింది.
కుమార్తె మామతో పరారైన తల్లి
ఇలాంటి దాని కంటె మరింత వివాదాస్పదమైన ఘటన బదాయూన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత అనే 43 ఏళ్ల మహిళ, తన కుమార్తె మామగారు అయిన శైలేంద్ర అలియాస్ బిల్లుతో పరారైంది. ఈ ఇద్దరి మధ్య వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియకపోయినా, గత కొంతకాలంగా వారిద్దరి మధ్య అనుబంధం పెరిగిందని సమాచారం.
భర్త తరచూ ఇంట్లో లేనందున ?
మమత భర్త సునీల్ కుమార్ వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్. ఉద్యోగ కారణంగా నెలకు కొన్ని రోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. ఈ సమయంలో ఆమె తన బంధువు అయిన శైలేంద్రను తరచూ ఇంటికి పిలిపించుకునేదని, అతడితో సంబంధం కొనసాగించిందని మమత కుమారుడు తెలిపారు. శైలేంద్ర మూడు రోజులకోసారి ఇంటికి వచ్చేవాడని, దీంతో వారు రూము మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మమత కుమారుడు తెలిపారు. ఈ ఘటనలో మమత తన భర్త పంపిన డబ్బు, బంగారంతోపాటు శైలేంద్రతో కలిసి టెంపోలో పారిపోయింది. ఆమె భర్త సునీల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్ చెప్పిన ప్రకారం, అతను కుటుంబ పోషణ కోసం బాగా కష్టపడుతూ ఉండేవాడు. తను పంపిన డబ్బుతో భార్య ఈ విధంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురయ్యాడని వాపోయాడు. మమత పొరుగింటివారు కూడా సునీల్ ఎక్కువగా ఇంటికి వచ్చేవాడు కాదని, ఈ క్రమంలో శైలేంద్ర తరచూ మమత ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడని, బంధువు కావడంతో ఎవరూ అనుమానించలేదని తెలిపారు. ఈ ఘటనపై సునీల్ కుమార్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒక కూతురి వివాహం 2022లో జరిగిందని సమాచారం. ఆమె పెళ్లి అయిన మామగారు శైలేంద్రతో మమత వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకోవడంతో పరారైనట్టు తెలుస్తోంది.
Read also: Madhya Pradesh : ప్రియుడి కోసం భర్త హత్య