ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) లో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర పత్రాలు లేకున్నా పోలీసులు కొన్ని వేల రూపాయల వరకు మాత్రమే జరిమానా విధిస్తారు. కానీ ముజఫర్‌నగర్ (Muzaffarnagar) జిల్లాలో ఓ స్కూటీ యజమానికి విధించిన చలాన మొత్తం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. డాక్యుమెంట్లు సరిగా లేనందుకు ఒక స్కూటీ ఓనర్‌కు ఏకంగా రూ.21 లక్షల చలాన్ విధించడం పెను సంచలనం రేపుతోంది.
Read Also: Amit Shah: అమిత్ షా లాలూ–మోదీ పోలికపై ఘాటు వ్యాఖ్యలు
వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 4న అన్మోల్ సింఘాల్ అనే వ్యక్తి తన స్కూటీపై బయటికి వెళ్లాడు. అయితే న్యూ మండి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపి తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు ఫైన్ విధించారు.అతడు తన చలానా చెక్ చేయగా అందులో రూ.20,74,000 జరిమానా ఉంది.

ఇది చూసి షాకైపోయిన అతడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది వైరల్ అవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు దృష్టికి చేరింది. ఆ జరిమానాను రూ.4 వేలుగా సవరించారు. ఈ ఘటనపై ముజఫర్ నగర్ ట్రాఫిక్ ఎస్పీ స్పందించారు.
ఈ సెక్షన్ కింద ఉన్న కనీస జరిమానా
స్కూటీ వ్యక్తికి చలానా జారీ చేసిన SI పొరపాటు వల్ల ఇలా భారీగా ఫైన్ పడ్డట్లు తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 ప్రకారం అవసరమైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయవచ్చని తెలిపారు. ఈ సెక్షన్ కింద కనీస జరిమానా రూ.4,000గా ఉందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: