ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పెళ్లైన కేవలం మూడు రోజుల్లోనే నవ వధువు విడాకులు డిమాండ్ చేయడం కలకలం రేపింది. తాను వైవాహిక బంధానికి అసమర్థుడిని అన్న విషయాన్ని పెళ్లినాటి రాత్రే వరుడు ఆమెకు చెప్పడంతో, ఈ మోసాన్ని సహించలేని ఆ మహిళ వెంటనే లీగల్ నోటీసు జారీ చేసింది.
Read Also: America: US Fed వడ్డీ రేట్లు తగ్గింపు.. భారత మార్కెట్లపై ప్రభావం!

72 గంటల్లో విడాకుల నిర్ణయం: అసలు కారణం
సాధారణంగా వివాహమైన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత పొసగక విడాకులు తీసుకోవడం గురించి వింటుంటాం. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఈ జంట పెళ్లైన కేవలం 72 గంటల్లోనే విడాకులు తీసుకోవాలనుకుంది. గోరఖ్‌పూర్‌కు చెందిన ఈ యువతి, యువకుడికి నవంబర్ 28వ తేదీన వివాహం జరిగింది. డిసెంబర్ 1వ తేదీనే వధువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లి విడాకులు ఇవ్వమని కోరడంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అప్పుడే నవ వధువు వచ్చి, 25 ఏళ్ల వరుడు పెళ్లిరోజు రాత్రే తాను వైవాహిక బంధానికి పనికి రానని చెప్పినట్లుగా తెలిపింది. శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో తాను జీవితాన్ని గడపలేనని స్పష్టం చేస్తూ, అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు వివరించింది.
వైద్య పరీక్షలు మరియు ఖర్చుల సెటిల్‌మెంట్
వధువు కుటుంబం డిమాండ్ మేరకు వరుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నవ వధువు ఆరోపణ నిర్ధారణ అయింది. దీంతో వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాదం చివరకు రాజీకి దారి తీసింది. వివాహ ఖర్చుల కింద రూ. 7 లక్షలు, అలాగే పెళ్లి సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్‌లు నెల రోజుల్లోగా తిరిగి ఇచ్చేందుకు వరుడి కుటుంబం అంగీకరించి, అగ్రిమెంట్‌పై సంతకం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: