పెళ్లంటే నూరేళ్లు కలిసిమెలసి హ్యాపీగా జీవించేందుకు చేసుకునే ఓ మధురమైన ఒప్పందం. అంతేకాదు రెండు మనసులమధ్య అనుబంధం రెండు కుటుంబాల ఆప్యాయతలకు ఆహ్వానం. కానీ ఇటీవల చాలా పెళ్లిళ్లు కట్నం కోసం, అక్రమసంబంధాల కోసం, ఒకరినొకరు అర్థం చేసుకోలేనితనంతో పెళ్లైన కొద్దిరోజులకే పెటాకులైపోతున్నాయి. కొన్ని పెళ్లిళ్లు అయితే పెళ్లిరోజునే రద్దు అవుతున్నాయి. ఇలాంటి(Uttar Pradesh) ఓ పెళ్లి కూడా పెళ్లిరోజే పెళ్లి రద్దు అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Read also: IRCTC: హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

20 లక్షల డిమాండ్.. పెళ్లి రద్దు అంటూ బెదిరింపులు
ఉత్తరప్రదేశ్ లోని(Uttar Pradesh) బరేలీలో ఓ పెళ్లి(Wedding) జరుగుతున్నది. రెండుకుటుంబాలు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కొద్దిగంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈలోగా పెళ్లికొడుకు వారు రూ.20లక్షల కట్నం, ఓ కారును డిమాండ్ చేశారు. అదనపు కట్నం కోసం వరుడి కుటుంబసభ్యులు ఒత్తిడి చేశారు. అంతేకాదు వివాహ వేడుకలను కొనసాగించవద్దని బెదిరించారు. దీంతో వధువు కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. కానీ వధువు ఇంతలోనే తేరుకుని, తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెగేసి చెప్పింది. ఆ వధువు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో వీడియో కాస్త వైరల్ గా మారింది. ‘కట్నం దురాశపరులను’ పెళ్లి చేసుకోవాలని తాను కోరుకోవడం లేదని, తన కుటుంబాన్ని అగౌరవపరిచే వ్యక్తితో కలిసి జీవించలేనని చెప్పింది. వధువు నిర్ణయానికి చాలామంది ఫిదా అయ్యారు. ఆమె ఆత్మగౌరవం వైపు నిలబడడం గొప్పగా ఉందని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ కేసు కాస్త పోలీసులవరకు చేరింది. మన సమాజంలో వరకట్నం వేధింపులు ఎంతగా పాతుకునిపోయిందో ఈ ఘటన తెలుపుతున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: