Layoffs In US Job Market : రాజకీయ రంగా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఉద్యోగ అవకాశాలు మందగించడమే కాకుండా లేఆఫ్స్ పరంపర కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూఎస్ కార్మిక శాఖ (US Department of Labor) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జులై నెలలోనే దాదాపు 23,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతకుముందు మే, జూన్ నెలల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రెండు నెలల వ్యవధిలోనే అమెరికా జాబ్ మార్కెట్ సుమారు 1,03,000 ఉద్యోగాలను కోల్పోయింది. వరుసగా మూడో నెల కూడా ఉద్యోగ కోతలు నమోదు కావడం ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతోంది.
Read Also: Kenya Elephants Death: కెన్యాలో ఘోరం: సైనైడ్ విషప్రయోగంతో 15 ఏనుగులు దారుణ మృతి!

Layoffs In US Job Market : నిరుద్యోగిత రేటు తగ్గినా పెరుగుతున్న ఆందోళన
జులై నెలలో నిరుద్యోగిత రేటు (Unemployment Rate) స్వల్పంగా తగ్గనప్పటికీ, అది సానుకూల పరిణామం కాదని కార్మిక శాఖ తెలిపింది. వేలాది మంది నిరుద్యోగులు జాబ్ మార్కెట్ నుంచి వైదొలగడం, కొత్తగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గడమే నిరుద్యోగిత రేటు తగ్గడానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది. అనగా, కొత్త ఉద్యోగాల సృష్టి జరగకపోవడంతో చాలామంది ఆశలు వదులుకుని పోటీ నుంచి తప్పుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్‌పై తమ పూర్తి ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్నికల్లో ప్రచారం చేసే సమయంలో “శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన”ను ప్రధాన హామీలుగా వినిపిస్తున్న ట్రంప్‌నకు ఈ జులై ఉద్యోగాల నివేదిక మింగుడుపడని అంశంగా మారింది. ప్రతిపక్ష డెమోక్రాట్లు ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని ట్రంప్ ఆర్థిక విధానాలపై విమర్శల వర్షం కురిపించే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :