हिन्दी | Epaper

United Nations: గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం

Saritha
United Nations: గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం

United Nations: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధాన్ని కాస్తయినా ఆపేందుకు అంతర్జాతీయ సమాజం గట్టి చర్యలు చేపట్టింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి భారతదేశం కో-స్పాన్సర్‌‌గా నిలిచి తన వ్యూహాత్మక మద్దతును ప్రకటించడం గమనార్హం కాగా ఇరాన్‌కు మిత్ర దేశాలు అయిన చైనా, రష్యా వంటి దేశాలు కనీసం దీనికి అడ్డు చెప్పలేకపోయాయి. ముఖ్యంగా ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉండడమే కాకుండా ఖమేనీ మృతి గురించి చర్చ తీసుకురాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాయి.

Read Also: Iran war: యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

United Nations: గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
United Nations: Resolution passed in the UN calling for an end to attacks on Gulf countries

బహ్రెయిన్ నేతృత్వంలో వచ్చిన ఈ తీర్మానానికి ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలు మద్దతు తెలిపాయి. అందులో భారత్ కూడా ఉండడం గమనార్హం. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని ఇది ప్రపంచ శాంతికి పెను ముప్పుగా మారిందని ఈ తీర్మానం చెప్పింది. ప్రధానంగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ వంటి దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని ఐరాస స్పష్టం చేసింది. అంతేకాకుండా హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకోవడాన్ని, సముద్ర మార్గాల్లో అశాంతిని సృష్టించడాన్ని భద్రతా మండలి ఏక కంఠంతో ఖండించింది.

భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉండగా 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇరాన్‌కు ఆప్త మిత్రులుగా పేరున్న రష్యా, చైనాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా కేవలం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. అయితే ఈ తీర్మానంపై రష్యా, చైనా అసంతృప్తి వ్యక్తం చేశాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870