కెనడాలోని మనిటోబాలో మంగళవారం ఉదయం ఒక దారుణమైన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న రెండు చిన్న విమానాలు ఢీకొన్న ఘటన (Plane collision incident)లో ఇద్దరు పైలట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 23 ఏళ్ల కేరళకు చెందిన శ్రీహరి సుకేశ్ ఉన్నారు. ఈ వార్త కుటుంబసభ్యులతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.ఘటన రోజున, ఓటావాలోని హార్వ్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్ (Harvey’s Air Pilot Training School) కు చెందిన రెండు సెస్‌నా విమానాలు శిక్షణ విమానాలుగా ఎగిరాయి. టేకాఫ్, ల్యాండింగ్ ప్రాక్టీస్ కోసం పయనమైన ఈ విమానాలు, అదే సమయంలో ల్యాండ్ చేయడానికి వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం మినీ రన్‌వే పై కొన్ని వందల మీటర్ల దూరంలో జరిగింది.

రేడియో ఉన్నా, ఒకరినొకరు గమనించకపోవడం విషాదం
రెండు విమానాల్లో రేడియోలు ఉండి కూడా, ఇద్దరు విద్యార్థులు ఒకరినొకరిని గమనించలేకపోవడం ఈ ప్రమాదానికి కారణమైందని సీబీఎస్ న్యూస్ నివేదించింది. ప్రమాదం జరిగిన వెంటనే, ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీహరి సుకేశ్ కొచ్చికి చెందినవాడు
భారత కాన్సులేట్ జనరల్ ఒక ప్రకటనలో, శ్రీహరి సుకేశ్ కేరళ రాష్ట్రం, కొచ్చికి చెందినవాడని వెల్లడించింది. శవసంస్కరణలకు సంబంధించిన విషయాల్లో బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు భారత అధికారులు ముందుకొచ్చారు. “కుటుంబ సభ్యులు, శిక్షణ పాఠశాల, స్థానిక పోలీసులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి” అని వారు తెలిపారు.
కుటుంబంలో శోక అలలు
శ్రీహరి పైలట్ కావాలని కలలు కంటూ కెనడాకు వెళ్లిన యువకుడు. కానీ ఆ కలే చివరగా మారింది. తన కోరిక నెరవేర్చే ప్రయత్నంలో ఆయన ప్రాణాలను కోల్పోవడం తల్లిదండ్రులకు తట్టుకోలేని విషాదం. ఈ ఘటన పైలట్ శిక్షణ సంస్థల్లో భద్రత ప్రమాణాలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
Read Also : Earthquake : ఢిల్లీలో 4.4 తీవ్రతతో భూకంపం