తమిళనాడు(Tamil Nadu) వచ్చే ఏడాది జరగబోయే శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో, తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ రాజకీయంగా మళ్లీ చురుకుగా మారారు. కరూర్ ఘటన తరువాత కొంతకాలం తగ్గిన ఆయన కార్యకలాపాలు ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకున్నాయి. (TVK Vijay)ఈ సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన ఆయన, ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు నిర్వహించే సంప్రదింపుల సమావేశాలకు టీవీకేకూ ఆహ్వానం పంపాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ, శాసనసభ ఎన్నికల సిద్ధత సమావేశాల్లో టీవీకేని నిర్లక్ష్యం చేస్తున్నారని విజయ్ అభిప్రాయపడ్డారు. గుర్తింపు ఉన్నా లేకపోయినా, ప్రతి రాజకీయ పార్టీకి సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక సూత్రమని ఆయన పేర్కొన్నారు.
Read also: ఢిల్లీ పేలుడు ఘటనలో ఇద్దరు వైద్యవిద్యార్థులు అరెస్టు

సమాన హక్కులు కావాలన్న విజయ్
రాష్ట్రవ్యాప్తంగా టీవీకేకి (TVK Vijay) గట్టి బలం, ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఎన్నికల కమిషన్ సర్కులర్లు, నోటీసుల్లో పార్టీ పేరును ప్రస్తావించకపోవడం అసమానతకు దారితీస్తోందని విజయ్ అన్నారు. సంప్రదింపుల సమావేశాల్లో టీవీకేని మినహాయించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల ముఖ్య వర్గం పాల్గోనే అవకాశాన్ని కోల్పోతుందని ఆయన హెచ్చరించారు.
టీవీకే సంపూర్ణ సహకారంతో ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యానికి తోడ్పడతుందని విజయ్ స్పష్టం చేశారు. ఈ న్యాయమైన అభ్యర్థనను పరిశీలించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల అధికారి, తమిళనాడు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: