దేశవ్యాప్తంగా 230 మిలియన్ల కుటుంబాల్లోని 90 కోట్ల మంది వీక్షకులను టెలివిజన్ నెట్‌వర్క్ కలుపుతోందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక గణాంకాలను విడుదల చేసింది.
Read Also: Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురిని అరెస్టు చేసిన ఎన్ ఐఎ
భారత మీడియా (Indian Television), వినోద (M&E) రంగం 2024లో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2.5 లక్షల కోట్లు అందించింది. ఇది 2027 నాటికి రూ.3 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. కేవలం టెలివిజన్, బ్రాడ్‌కాస్టింగ్ విభాగం నుంచే 2024లో దాదాపు రూ.68,000 కోట్ల ఆదాయం సమకూరింది.
డిజిటల్ విస్తరణ, 4K ప్రసారాలు, స్మార్ట్ టీవీలు, 5G, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఈ వృద్ధికి మరింత ఊతమిస్తున్నాయి.దేశంలో డిజిటల్ సేవలను అందరికీ చేరువ చేయడంలో డీడీ ఫ్రీ డిష్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6.5 కోట్ల ఇళ్లలో డీడీ ఫ్రీ డిష్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
2014లో కేవలం 59 ఛానళ్లతో ప్రారంభమైన ఈ ఉచిత డీటీహెచ్ సేవ, 2025 నాటికి 482 ఛానళ్లకు విస్తరించడం విశేషం. 1959లో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, 1982 ఏషియన్ గేమ్స్‌తో కలర్ టీవీ యుగంలోకి అడుగుపెట్టిన భారత టెలివిజన్ (Indian Television).. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గనిర్దేశంలో టెలివిజన్ రంగం దేశ సామాజిక-ఆర్థికాభివృద్ధికి అద్దం పడుతోంది. నవంబర్ 21న ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ఏటా ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రసార భారతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: