తిరుమల : కలియుగ వైకుంఠం తిరుమలకొండ పై భక్తులు ఆధ్యాత్మిక భావంతో మెలగాలని, పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని తిరుమల తిరుపతిదేవస్థానం కోరింది. ఆధ్మాత్మిక వాతా వరణం నెలకొనేలా చూస్తున్న టిటిడికి(TTD NEWS ) భక్తులు సహకరిం చాలని విజప్తి చేసింది. తిరుమలలో ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా రీల్స్, వీడియోలు చిత్రీకరిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి టిటిడి సిద్ధమైంది. ఇలాంటి తప్పులు చేయవద్దని భక్తులకు సూచించింది. తిరుపతి అలిపిరిలో, తిరుమలకొండపై(Tirumala) రీల్స్ చేసి కొందరు సామాజిక మాధ్యమాల్లో చేర్చడం (అప్లోడ్)పై తీవ్రంగా పరిగణించింది. దీనిపై టిటిడి సంచన నిర్ణయం కూడా తీసుకుంది. ఇష్టదైవమ్ ఆపదమొక్కులవాడి దర్శనానికి వచ్చి రీల్స్(Reels) ఫోటో షూట్ చేస్తూ తోటి భక్తులకు పలువురు ఇబ్బందులు కలిగించారు. అంతేగాక ఆలయం ముందు, మాఢవీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో చేర్చడంపై టిటిడి తీవ్రంగా పరిగణించింది. గతంలో జరిగిన అనేక తప్పిదాలపై టిటిడి కేసులు నమోదు, భక్తులపట్ల సంయమనం ధోరణితో వ్యవహరించింది. అయితే ఈ రీల్స్ పిచ్చి పవిత్రతకు భంగం కలిగేలా, ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినేలా మారింది. ఏకంగా ఆలయం ముందు రీల్స్ చేయడాన్ని టిటిడి నిషేధించింది. దీనిపై టిటిడి విజిలెన్స్, పోలీసుశాఖలు గట్టి నిఘా ఉంచాయి.

TTD NEWS
READ AlSO: