Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రష్యా ఆయిల్ కొనుగోళ్లపై పాత వాదనను ప్రస్తావించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు “పూర్తిగా ఆపేసిందని” ఆయన పేర్కొనడం దౌత్యవర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, భారత ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందిస్తూ మా ఇంధన విధానం పూర్తిగా స్వతంత్రం, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం” అని స్పష్టం చేసింది. ట్రంప్, ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చైనా రష్యా (Russia) చమురు కొనుగోళ్లు తగ్గిస్తోంది, భారత్ అయితే పూర్తిగా నిలిపివేసింది. మేము ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాం” అని తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యలు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సమయంలో రావడం, అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Read also: Delhi Pollution: కాలుష్య నగరంగా మారిన ఢిల్లీ – ఆరోగ్యంపై ముప్పు!

Trump: ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తున్న భారత ప్రభుత్వం
గత కొంతకాలంగా ట్రంప్ (Trump) తరచుగా ఇదే ప్రకటనను పునరావృతం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తుందని తాము తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, నాటో నాయకులతో సమావేశంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారత్‌లో అసంతృప్తి కలిగించింది. ఇక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం స్పష్టంగా చెబుతోంది భారత్ ఇంధన అవసరాలపై తీసుకునే నిర్ణయాలు బయటి ఒత్తిళ్లకు లోబడవు. మాకు ప్రాధాన్యం స్థిరమైన ధరలు, భరోసా గల సరఫరా వ్యవస్థ, మరియు దేశ ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే.
ట్రంప్ ఎందుకు ఈ వ్యాఖ్య చేశారు?
రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయిల్ దిగుమతులపై ఇతర దేశాల వైఖరిని ప్రస్తావించారు.
భారత్ ప్రతిస్పందన ఏమిటి?
భారత్ తన ఇంధన విధానం పూర్తిగా స్వతంత్రమని, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: