అబద్ధాలు, మోసాలు తప్ప పాకిస్తాన్ (Pakistan) చేసిందేమీ లేదు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకప్పుడు పాకిస్తాను తీవ్రంగా విమర్శించారు. టెర్రరిస్టులకు మద్దతుగా ఉండే పాకిస్తాన్ ట్రంప్ (Donald Trump) తనదైన శైలిలో విమర్శించేవారు. కానీ ఇప్పుడు ఇదంతా గతం. నేడు పాకిస్తాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాల కోసం కొత్త స్నేహం అడుగులు వేస్తున్నది.
Donald Trump : ట్రంప్ మరో సంచలన ప్రకటన
మారిన రాజకీయ, వాణిజ్య సమీకరణాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లకు వైట్ హౌస్ (White House) లో ఘనస్వాగతం పలికారు. ఈ పరిణామం ఇరుదేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి సంకేతంగా నిలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో (Marco Rubio) కూడా హాజరైన ఈ సమావేశానికి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ,పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ ‘గొప్ప నాయకులు’ అని కొనియాడారు.

వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి
షెహబాజ్ షరీఫ్ అసిమ్ మునీర్ వైట్ హౌస్ కు చేరుకున్నప్పుడు ట్రంప్ ఇతర కార్యక్రమాలలో ఉన్నప్పటికీ, వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఓవల్ ఆఫీస్ (Oval Office) లో సమా వేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు వీరి సమావేశం జరిగింది. పాకిస్తాన్లో లభించే అరుదైన ఖనిజాలు, నిక్షేపాలను అమెరికా (America) కు సరఫరా చేసేందుకు ఒప్పందం జరిగింది.
దీనిలో భాగంగా ఒక అమెరికన్ సంస్థ (American company) పాక్ ఖనిజ రంగంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. అంతేకాకుండా, పాకిస్తాన్లోని భారీ చమురు నిల్వలను వెలికితీయడంలో సహాయపడతామని ట్రంప్ గతంలోనే హామీ ఇచ్చారు. రెండు దేశాలమధ్య పెరుగుతున్న స్నేహబంధం భారత్ కు ఇబ్బందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: