కెనడాలో (Canada) రెండు ప్రత్యర్థి ట్రక్ గ్రూపుల (Truck DriverShooting) మధ్య జరిగిన కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు ట్రక్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్‌లో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిపై అక్రమ ఆయుధాల వాడకం మరియు అనధికారికంగా తుపాకీని కలిగి ఉండడం వంటి అభియోగాలు మోపారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read Also: Pakistan Division: పాకిస్తాన్‌ను 12 ప్రావిన్సులుగా విభజించే యోచన

కాల్పుల ఘటన మరియు దర్యాప్తు వివరాలు
ఈ సంఘటన అక్టోబర్ 7న రాత్రి 10:45 గంటలకు మెక్‌వీన్ డ్రైవ్ మరియు కాజిల్‌మోర్ రోడ్ ప్రాంతంలో జరిగింది. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన రెండు వేర్వేరు గ్రూపులు ఘర్షణకు దిగాయి, ఈ క్రమంలోనే రెండు గ్రూపుల మధ్య కాల్పులు కూడా జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సుదీర్ఘ దర్యాప్తు తర్వాత కాల్పుల్లో పాల్గొన్న ఓ గ్రూపునకు సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. దీంతో నవంబర్ 20న కాలెడాన్‌లోని ఒక ఇంటిపై దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన భారత సంతతి వ్యక్తులు
పట్టుబడిన అనుమానితులు ముగ్గురూ భారత సంతతికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు:
- మంజోత్ భట్టి
- నవజోత్ భట్టి
- అమంజోత్ భట్టి
వీరిలో మంజోత్ భట్టిపై తుపాకీతో రెక్‌లెస్‌గా కాల్పులు జరిపాడనే అభియోగాలు మోపారు. నవజోత్ మరియు అమన్‌జోత్‌లపై వాహనంలో తుపాకీ ఉందని తెలిసినా ప్రయాణించారనే అభియోగాలను మోపారు. ఈ రెండు గ్రూపులు దక్షిణ ఆసియా సముదాయానికి చెందినవిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన టో ట్రక్ ఇండస్ట్రీలో ప్రత్యర్థుల నేపథ్యంలో జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారించారు.
పరారీలో ఉన్న నాల్గవ వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని పేరును ఇంకా ప్రస్తావించనప్పటికీ, నల్ల జాకెట్, బ్లూ జీన్స్, తెల్ల రన్నింగ్ షూస్ ధరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు ఒక వీడియోను విడుదల చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: