Udhayanidhi Stalin : ఉదయనిధికి త్రిష కౌంటర్ ఇచ్చినట్లేనా ?

Follow Us: Google News Daily Hunt
Udhayanidhi Stalin : ఉదయనిధికి త్రిష కౌంటర్ ఇచ్చినట్లేనా ?
FONT SIZE
GET APP

Udhayanidhi Stalin : డిఎమ్‌కే నేత ఉదయనిధి స్టాలిన్ ఒక బహిరంగ సభలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరియు హీరోయిన్ త్రిషలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద, ద్వంద్వార్థ వ్యాఖ్యలు రాజకీయంగా, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదంపై కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న నటి త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “ఈ వయసులోనూ ఇంత డ్రామా చేయడం చాలా ఇబ్బందిగా ఉంది.. వెళ్లి కొంత డబ్బు సంపాదించి మనశ్శాంతి పొందండి” అని రాసుకొచ్చిన ఆమె, మరొక పోస్టులో “ఒకప్పుడు మీరు ప్రార్థించిన జీవితం మీకు లభించడం ఎంత అదృష్టమో గ్రహించండి” అని పేర్కొన్నారు. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, రీసెంట్‌గా జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Read Also : యువశక్తికి మత్తు సంకెళ్లు, వికసిత్ భారత్కు ముప్పు

ఉదయనిధికి కౌంటరా? లేక విడాకుల ప్రచారాలకేనా?

త్రిష చేసిన ఈ క్రెప్టిక్ (పరోక్ష) పోస్టులపై సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఇటీవల రాజకీయ సభలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌కే త్రిష ఈ రీతిలో గట్టి కౌంటర్ ఇచ్చారని ఒక వర్గం నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు, నటుడు విజయ్ ఆయన భార్య సంగీత చుట్టూ తిరిగిన విడాకుల రూమర్లు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఉద్దేశించే త్రిష ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, ఎవరి పేర్లనూ బయటకు చెప్పకుండా త్రిష షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : https://epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు