అహ్మదాబాద్‌లో (In Ahmedabad) జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 274 మందిని గుర్తు చేస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sculpture by Sudarshan Pattnaik) తనదైన రీతిలో నివాళులర్పించారు. పూరీ బీచ్‌పై బంగారు ఇసుకతో తీర్చిదిద్దిన శిల్పం చూసినవారిని కదిలించేస్తోంది.శనివారం జూన్ 14న ఆయన ఈ ప్రత్యేక శిల్పాన్ని ప్రజల ముందు ఉంచారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానం ప్రమాదంలో వందల మందిని కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సైకత శిల్పం భావోద్వేగాలకు వేదిక
ఈ శిల్పం మానవ బాధను, మృతుల జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రూపొందించబడింది. అలాగే ఇది ధైర్యాన్ని, సానుభూతిని సూచించేలా ఉంది. శిల్పాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పూరీ బీచ్‌కు తరలివచ్చారు. మృతుల కోసం ప్రార్థనలు చేశారు.
కళ ఓ సానుభూతి మాధ్యమం
ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ, విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా, అని అన్నారు. ఇలాంటి విషాద సంఘటనల్లో కళ భావోద్వేగాలను వ్యక్తం చేసే అద్భుత మాధ్యమం అని అభిప్రాయపడ్డారు.ఇలాంటి సంఘటనలపై తరచూ స్పందించే పట్నాయక్, గతంలో యూకేలో ఫ్రెడ్ డారింగ్‌టన్ శాండ్ మాస్టర్ అవార్డు అందుకున్నారు. ఆయన ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పూరీ బీచ్‌పై రూపొందించిన ఈ తాజా శిల్పం, ప్రజల హృదయాల్లోని బాధను ప్రతిబింబిస్తూ నిలిచిపోయింది.
Read Also : Dubai building fire : దుబాయ్‌లో 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం