కారేపల్లి Army Tribute : ఆర్మీ జవాన్ అనిల్ కు (Army jawan Anil) అశ్రునివాళి – సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు : దేశ సరిహద్దుల్లో 13 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ కాశ్మీర్ లోయలో జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సూర్య తండా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బానోత్ అనిల్ కుమార్ కు అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. వీరుడా నీకు వందనం.. అమరుడా నీకు వందనం అంటూ నినదిస్తూ హోరెత్తించింది. అంతకుముందు ఆర్మీ అధికారులు (Army officers) అనిల్ భౌతిక కాయాన్ని ఆర్మీ వాహనంలో తీసుకురాగా, కారేపల్లి ఎక్స్ రోడ్ నుండి నుంచి స్వగ్రామం సూర్య తండా వరకు 10 కిలోమీటర్లు భారీ ర్యాలీ తీశారు. ఆర్మీ అధికారులు భౌతికకాయాన్ని మోసుకొచ్చి ఇంటి ముందు వేదికపై ఉంచగా, భార్య రేణుక తల్లి సాలు అన్న ప్రసాద్ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య ఇంటి నుంచి అంతిమ యాత్రగా వెళ్లి, పొలం వద్ద సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రముఖుల నివాళి : జవాన్ అనిల్ భౌతిక కాయం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వైరా శాసనస భ్యులు మాలోతు రాందాస్ నాయక్ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ, మాజీ శాసనసభ్యులు లావుడియా రాములునాయక్ బానోత్ చంద్రావతి బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితరులు నివాళి అర్పించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :