భారతదేశ ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్ పేటీఎం (Paytm) మరో కీలక అడుగు వేసింది. దేశంలో ట్రావెల్ అనుభవాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ‘చెక్-ఇన్’ (Check-in) పేరిట ఓ కొత్త AI ఆధారిత ట్రావెల్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా బస్, మెట్రో, ట్రైన్, ఫ్లైట్ టికెట్లను ఒకే వేదికపై బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. పేటీఎం చెక్-ఇన్ యాప్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం టికెట్లు బుక్ చేయడమే కాదు, యూజర్‌కి వ్యక్తిగతంగా సరిపోయే ట్రావెల్ ప్లాన్‌ను సజెస్ట్ చేస్తుంది.
Read Also: TATA: వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న టాటా
టూరిస్టు ప్లేస్‌లు వరకు సూచిస్తుంది
ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ పర్సనల్ ట్రావెల్ ప్లాన్స్‌ను రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయాలనుకుంటే, యాప్ అతనికి సరైన టైమింగ్స్, తక్కువ ఖర్చుతో ఉన్న ఫ్లైట్‌లు లేదా ట్రైన్ ఆప్షన్స్, సమీప హోటల్స్, టూరిస్టు ప్లేస్‌లు వరకు సూచిస్తుంది.

ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పనిచేస్తుంది. యూజర్ గత బుకింగ్ హిస్టరీ, ప్రిఫరెన్సులు, ప్రయాణ సమయం వంటి అంశాలను విశ్లేషించి, డెస్టినేషన్ రికమెండేషన్స్‌ను ఇవ్వడం ఈ యాప్ ప్రత్యేకత.దీంతో ప్రజలు మరింత స్మార్ట్‌గా, సులభంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవచ్చని పేటీఎం (Paytm) ట్రావెల్ సీఈవో వికాస్ జలాన్ (CEO Vikas Jalan) తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: