భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కోట్లాది ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారింది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో చాలామంది గుర్తించని ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది లగేజీ (సామూను) బరువు పరిమితి. చాలామంది తమకు కావలసినంత సామాను(Train luggage) తీసుకెళ్లవచ్చని అనుకుంటారు. కానీ, భారత రైల్వే(Indian Railways) దీనికి స్పష్టమైన నియమాలు విధించింది. ఈ నియమాలను పాటించకపోతే మీరు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు.
Read also: ఇకపై కొత్త ద్విచక్ర వాహనాలకు ఏబీఎస్ తప్పనిసరి..

లగేజీ బరువు 35 కిలోల కంటే ఎక్కువ ఉంటే చార్జీలు చెల్లించాల్సిందే..
మీరు రైల్వేలో రెండవ తరగతి టికెట్(Train luggage) బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నట్లయితే..మీ లగేజీ బరువు 35 కిలోల కంటే ఎక్కువ కాకూడదు. అంటే మీరు 35 కిలోల వరకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా తీసుకెళ్లవచ్చు.. కానీ, మీరు తీసుకెళ్తున్న లగేజీ 35కిలోల కంటే ఎక్కువగా 70 కిలోల వరకు ఉంటే, అప్పుడు మీరు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీని రైల్వే స్టేష క్లీన్ లోని లగేజీ బుకింగ్ కౌంటర్ వద్ద ముందుగానే చెల్లించాలి.
లగేజీ వ్యాన్ ద్వారా పంపించాలి
మీ లగేజీ బరువు 70కిలోల కంటే ఎక్కువైతే, మీరు దానిని మీతోపాటు తీసుకెళ్లకూడదు. అప్పుడు రైల్వే రిజర్వ్ లగేజీ వ్యాన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ వ్యాన్ లో లగేజీని విడిగా బుక్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే టిటిఈ లగేజీని తనిఖీ చేసినప్పుడు జరిమానా విధించవచ్చు. సాధారణంగా రైల్వేలో ప్రయాణికుల లగేజీ బరువును ఎవరూ తూకం వేయరు. కానీ కొన్నిసార్లు టిటిఈకి మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే లేదా అనుమానం వస్తే, ఆయన లగేజీని తనిఖీ చేయవచ్చు. మీ లగేజీ బరువు పరిమితిని మించితే, మీరు తగినంత ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకు రూ. 600 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. రైల్వేలు ప్రతి బోగీలో ప్రయాణికుల భద్రతను, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లగేజీ పరిమితిని నిర్ణయించాయి. చాలా సామాను తీసుకెళ్లడం వల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: