పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను(Traffic Challan) క్లియర్ చేసుకోవాలనుకునే వాహనదారులకు డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశం. ఈ కార్యక్రమంలో పెండింగ్ చలాన్లను, పెనాల్టీలను భారీ రాయితీలతో సెటిల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కొన్ని కేసుల్లో 50% నుంచి 100% వరకు డిస్కౌంట్లు ఇవ్వబడతాయి. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, రెడ్ సిగ్నల్ దాటడం వంటి సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు. అయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్, డేంజరస్ డ్రైవింగ్ వంటి తీవ్రమైన కేసులు ఈ పరిధిలోకి రావు.
Read Also: New Rules: నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి

చలాన్లను ఇలా సెటిల్ చేసుకోవచ్చు
- ముందుగా వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లను తెలుసుకోవాలి.
- పరివాహన్ పోర్టల్ లేదా సంబంధిత రాష్ట్ర ట్రాఫిక్ వెబ్‌సైట్‌లో(Traffic Challan) వివరాలు అందుబాటులో ఉంటాయి.
- అవసరమైతే టోకెన్ తీసుకోవాలి.
- NALSA వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసి టోకెన్ పొందవచ్చు.
- నిర్ణయించిన సమయంలో RC, డ్రైవింగ్ లైసెన్స్, ఐడి ప్రూఫ్, చలాన్ కాపీలతో కోర్టుకు వెళ్లాలి.
- జడ్జీలు, ట్రాఫిక్ అధికారులు నిర్ణయించిన మొత్తాన్ని క్యాష్ లేదా UPI ద్వారా చెల్లించాలి.
- చెల్లింపు పూర్తయిన తర్వాత సెటిల్‌మెంట్ ఆర్డర్ జారీ చేయబడుతుంది.
- దీనితో సంబంధిత కేసు తిరిగి ఓపెన్ చేయబడదు.
ఎలాంటి చలాన్లు సెటిల్ చేసుకోవచ్చు?
- సీట్ బెల్ట్/హెల్మెట్ లేక డ్రైవింగ్
- సిగ్నల్ జంపింగ్
- స్పీడ్ లిమిట్ అతిక్రమించడం
- తప్పుగా పార్కింగ్
- PUC లేకపోవడం
- లైసెన్స్ లేక డ్రైవింగ్
- వాహన ఫిట్‌నెస్, నంబర్ ప్లేట్ లోపాలు
- పొరపాటుగా జారీైన చలాన్లు
గమనిక: తీవ్రమైన ప్రమాదకర కేసులు మాత్రం లోక్ అదాలత్ పరిధిలోకి రావు.
ఏ రాష్ట్రాల్లో ఈ సదుపాయం?
డిసెంబర్ 13న జరగనున్న లోక్ అదాలత్‌లో క్రింది రాష్ట్రాల ప్రజలు తమ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను సెటిల్ చేసుకోవచ్చు:
- ఢిల్లీ
- హర్యానా
- పంజాబ్
- మహారాష్ట్ర
- ఉత్తరప్రదేశ్
- గుజరాత్
- తమిళనాడు
- తెలంగాణ
- కర్ణాటక
- రాజస్థాన్
- పశ్చిమ బెంగాల్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: