NHAI కొత్త నిర్ణయం – పరిశుభ్రత కోసం ప్రజలకు ప్రోత్సాహం
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పరిశుభ్రతను మెరుగుపరచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద ఉన్న టాయిలెట్లు శుభ్రంగా ఉండవు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించిన వారికి NHAI(National Highways Authority of India) బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
Read also: AP News గుంటూరు లో పట్టపగలే వ్యక్తిని దారుణంగా హత్య

టాయిలెట్ ఫోటో పంపితే రూ.1000 రివార్డ్
ప్రయాణికులు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద అపరిశుభ్రమైన టాయిలెట్లు గమనిస్తే, వాటి ఫోటోను ‘రాజ్ మార్గ్ యాత్ర (Raj Marg Yatra)’ యాప్ ద్వారా పంపవచ్చు.
ఫోటోతో పాటు వినియోగదారుడి పేరు, లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్ వంటి వివరాలు పంపాలి.
ఫోటోను అధికారులు పరిశీలించి అది సరైనదని నిర్ధారిస్తే, ఆ వ్యక్తికి రూ.1000 వరకు రివార్డ్‌గా అతని ఫాస్టాగ్ అకౌంట్‌లో రీఛార్జ్ చేస్తారు.
అక్టోబర్ 31 వరకు అవకాశం
ఈ కార్యక్రమం అక్టోబర్ 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. NHAI ప్రకారం, ఈ పథకం ద్వారా టోల్ ప్లాజాల పరిశుభ్రత మెరుగుపడి, ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తున్నారు.
NHAI కొత్త కార్యక్రమం ఏంటి?
టోల్ ప్లాజాల వద్ద ఉన్న అపరిశుభ్రమైన టాయిలెట్ల ఫోటోలు పంపితే బహుమతి ఇచ్చే కార్యక్రమం.
ఫోటో ఎలా పంపాలి?
‘రాజ్ మార్గ్ యాత్ర (Raj Marg Yatra)’ యాప్‌లో ఫోటో, వివరాలతో పంపాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: