గుంతకల్లు : రాష్ట్రంలోని దక్షిణ మద్య రైల్వే గుంతకల్లు డివిజన్ తిరుపతి నుంచి నైరుతి రైల్వే మైసూర్ డివిజన్ చిక్కమగళూరు (Chikmagalur) మద్య కొత్తగా ప్రవేశపెట్టిన నెంబర్ 07424 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును నేటి(ఈ నెల 11) నుంచి ప్రారంభిస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం నేటి నుంచి ప్రారంభం కాబోతున్న ఈ ప్రారంభోత్సవపు ప్రత్యేక రైలు నిర్వహణకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.

బయలుదేరి
చిక్కమగళూరు నుంచి తిరుపతికి బయలుదేరే నెంబర్ 07424 ప్రారంభోత్సవ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు చిక్కమగళూరు నుంచి బయలుదేరి శనివారం తెల్లవారుజామున 2.30గంటలకు తిరుపతి (Tirupati) కి చేరుకుంటుంది. ఈ రైళ్లు మార్గమద్యలో శేఖరయ్య పట్టణం, బిసలెహళ్ళి, కోడూరు, బి దూర్, దేవనూరు, అరిసికెర, తిపూరు, తుముకూరు, చిక్ భన్వరా, బెంగళూరు, క్రిష్ణారాజాపురం, వైట్ ఫీల్డ్, బంగారుపేట్, కుప్పం, జోలార్పేట్, కాట్పాడి, చిత్తూరు, పాకాల స్టేషన్లలో నిలుస్తాయి.
తిరుపతి ఎందుకు ప్రసిద్ధి పొందింది?
తిరుపతి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం (తిరుమల తిరుపతి దేవస్థానం – TTD) వల్ల ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇది హిందూ ధార్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రముఖ క్షేత్రం.
తిరుపతిలోని ఇతర ప్రసిద్ధ స్థలాలు ఏమిటి?
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (తిరుచానూరు),శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం,శ్రీ కలహస్తి (తిరుపతికి సమీపంలో)శిలాతోరణం,చంద్రగిరి కోట,శ్రీవేంకటేశ్వర జంతుప్రదర్శనశాల (Zoo).
Read hindi news: hindi.vaartha.com
Read Also: Indrakeeladri: శాకంబరి ఉత్సవాలకు పూర్ణాహుతితో స్వస్తి