తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి తొమ్మిదిరోజుల పాటు జరగనున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ (Vice President CP Radhakrishnan) వస్తున్నారు. అలాగే ఆనవాయితీ ప్రకారం సంప్రదాయంగా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సిఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) రేపు తిరుమలకు చేరుకుంటూన్నారు.
తిరుపతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు
వీరితోబాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వస్తుండటంతో తిరుమల, తిరుపతి (Tirupati) లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇద్దరు ప్రముఖులు రేపు, ఎల్లుండి తిరుమలలోనే ఉండటనుండటంతో భద్రత (Security) పై సోమవారం ఉదయం.

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, జిల్లా సంయుక్తకలెక్టర్ శుభంబన్సల్, తిరుపతి కమిషనర్ మౌర్యతో కలసి భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలుపై సమీక్షించారు.
భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై తిరుమల అదనపు ఎస్పీ
తిరుమలలో పద్మావతి విశ్రాంతి గృహం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, శ్రీవారి ఆలయం, తిరిగి వాహనమండపం, అతిదిగృహం చేరుకోనుండటంతో పరిసరాల్లో భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణకు, డిఎస్పీ విజయ శేఖర్కు సూచనలు చేశారు. ప్రోటోకాల్ అంశాలు తదితర విధులుతోబాటు తిరుమలలో ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం పోలీసు భద్రత నడుమ సాగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: