తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఎన్ఎస్ఈ, దాని సభ్యులు, వాటాదారులు, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ ఉదయం శ్రీవారి దర్శనం ఎంతో సంతృప్తినిచ్చిందని చౌహాన్ పేర్కొన్నారు. “ఈరోజు ఉదయం తిరుమల (Tirumala) లో మాకు అద్భుతమైన దర్శనం లభించింది.
Read also: Tirupati: 25న గోవిందరాజస్వామి ఆలయంలో సాలకట్ల రథసప్తమి
యాదృచ్చికం
ఎన్ఎస్ఈతో పాటు మా సభ్యులు, వాటాదారులు, దేశం కోసం ఆశీర్వాదం తీసుకున్నాం” అని ఆయన వివరించారు.ఈ పర్యటన చాలా ముందుగానే ఖరారైందని, అయితే తాను తిరుపతికి చేరుకున్న సమయంలోనే ఎన్ఎస్ఈ ఐపీఓకు సంబంధించిన ప్రకటన వెలువడటం యాదృచ్ఛికమని చౌహాన్ అన్నారు. దీనిని తాను ఒక శుభశకునంగా, దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఎన్ఎస్ఈ ఐపీఓకు ఈ నెలలోనే ఆమోదం లభించవచ్చని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే సూచించారని చౌహాన్ తెలిపారు.
భారత క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో ఎన్ఎస్ఈ ఐపీఓ అత్యంత ముఖ్యమైన లిస్టింగ్‌లలో ఒకటిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కీలక తరుణంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని, ఇది చిరస్మరణీయమని చౌహాన్ పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: