బిహార్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోదీ–నితీశ్ కాంబోకు స్పష్టమైన మొగ్గు చూపించారు. కేంద్రంలో మోదీ నాయకత్వం, రాష్ట్రంలో నితీశ్ అనుభవం కలిసి వచ్చిన ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ భావన, “వికసిత్ బిహార్” నినాదం ప్రజల్లో మంచి ప్రభావం చూపింది. ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పరిపాలనలో స్థిరత్వం వంటి అంశాలు ఓటర్లను NDA వైపు ఆకర్షించాయి. ఇక మరోవైపు మహాగఠ్‌బంధన్‌లో సీట్ల కేటాయింపుపై వచ్చిన విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపం ప్రత్యర్థుల బలహీనతగా మారింది. లాలూ కుటుంబంలో తేజస్వీ–తేజ్ ప్రతాప్ మధ్య నెలకొన్న చీలికలు కూడా ప్రత్యక్షంగా ప్రజల దృష్టికి వచ్చి ప్రతికూల ప్రభావం చూపాయి.
Breaking News – Donald Trump : ట్రంపు కు క్షమాపణలు చెప్పిన BBC
ఈ ఎన్నికల్లో మహిళ ఓటర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం NDAకి కీలక అనుకూలతను తెచ్చింది. మహిళల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా జీవికా గ్రూపులు, గృహ నిర్మాణ సహాయాలు, ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు మంచి ఆదరణ పొందాయి. అంతేకాదు, ఎన్నికలకు ముందు 25 లక్షలకు పైగా మహిళల ఖాతాల్లో ప్రభుత్వం రూ.10,000 చొప్పున నేరుగా జమ చేయడం NDAపై మహిళల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది. శక్తివంతమైన మహిళా ఓటర్ల వర్గం ఏ దిశలో మొగ్గుచూపిందో, ఆ దిశలో ఫలితాలు స్పష్టంగా ప్రతిఫలించాయి.

ఇక దీనికి తోడు RJD పాలనపై ఇంకా ప్రజలలో ఉన్న ‘జంగల్ రాజ్’ భయం, చట్టవ్యవస్థపై నమ్మకం లేకపోవడం మహాగఠ్‌బంధన్‌కు భారీ ప్రతికూలతగా మారింది. భద్రతా సమస్యలు తిరిగి వస్తాయన్న భయం అనేక ఓటర్లను NDA వైపు తిప్పింది. ఈ సమీకరణాలన్నీ కలిసొచ్చిన సందర్భంలో NDA ప్రచారంలో ప్రస్తావించిన అభివృద్ధి, శాంతి, స్థిరత్వం అంశాలు ప్రజల మనసులో బలమైన ముద్ర వేశారు. ఫలితంగా, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామిక సమీకరణాలన్నీ NDAకి అనుకూలంగా జతపడి, మరోసారి బిహార్ రాజకీయ పటంలో NDA ఆధిక్యాన్ని స్పష్టంగా నిలిపాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/