బిహార్ రాజకీయాల్లో యాదవ్ కుటుంబం లోపలి ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) Tej Pratap Yadav:తన తమ్ముడు, ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. “తేజస్వి నీడలో నేను బతకలేను. అతడితో నా బంధం పూర్తిగా ముగిసిపోయింది. చివరి శ్వాస వరకు ఆర్జేడీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు” అంటూ తేజ్ ప్రతాప్ సంచలన ప్రకటన చేశారు.
Read Also: Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
మా మధ్య ఏం జరిగిందో అది గడిచిపోయింది
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాను కొత్తగా స్థాపించిన ‘జనశక్తి జనతా దళ్’ (జేజేడీ) తరఫున ప్రచారం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “గౌరవం ఉన్నంత వరకే బంధాలుంటాయి. గౌరవం కోసమే మనుషులు బతుకుతారు, చనిపోతారు. దానితో ఎవరూ రాజీపడరు” అంటూ తన తమ్ముడిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
“మా మధ్య ఏం జరిగిందో అది గడిచిపోయింది. నా దారిన నేను వెళ్తున్నాను. ఇక ఆర్జేడీలోకి తిరిగి వెళ్లను” అని తేజ్ ప్రతాప్ (Tej Pratap Yadav) స్పష్టం చేశారు. రాజకీయాలు, కుటుంబ సంబంధాలు వేర్వేరని, తన తల్లిదండ్రులు లాలూ యాదవ్, రబ్రీ దేవి ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత పొత్తుల గురించి
ఇటీవల పాట్నా విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌తో తేజ్ ప్రతాప్ మాట్లాడటంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల తర్వాత పొత్తుల గురించి మీడియా ప్రశ్నించగా “అన్ని దారులు తెరిచే ఉన్నాయి” అని ఆయన సమాధానమివ్వడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది.
అయితే, ఇది కేవలం సాధారణ భేటీయేనని, దీనికి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో తెలిపారు. కానీ, ఎన్నికల్లో జేజేడీకి మంచి సంఖ్యలో సీట్లు వస్తే ఆర్జేడీ మినహా మరే పార్టీతోనైనా తేజ్ ప్రతాప్ పొత్తు పెట్టుకోవచ్చని ఆర్జేడీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: