ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల (Marriages) పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మ్యాట్రిమోనియల్ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న మాట్లాడుతూ, ప్రేమ పెళ్లిళ్లలో వివాహం తర్వాత ప్రేమ తగ్గిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో దాంపత్య జీవనం కొనసాగేకొద్దీ పరస్పర అవగాహనతో ప్రేమ మరింత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. వివాహ బంధంలో పరస్పర గౌరవం, సహనం, బాధ్యతలు కీలకమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Read Also: Flipkart: ఈ నెల 17వ తేదీ నుంచి రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: